Onion Benefits: ఉల్లి చేసిన పని తల్లి కూడా చేయదంటారు. ఉల్లిలో అన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కూరల్లో విరివిగా ఉల్లిని వాడుతుంటాం. ఉల్లితో మనకు కలిగే ఆరోగ్యాల గురించి తెలిస్తే షాకే. పూర్వ కాలం నుంచే ఉల్లిని ఆహారంలో భాగంగా చేసుకున్నాం. అన్నిట్లో కూడా ఉల్లిని వేసుకుని రుచిగా తింటున్నాం. ఉల్లితో కూర కూడా చేసుకుంటారు. పచ్చడి చేస్తుంటారు. ఇలా మన దైనందిన జీవితంలో ఉల్లిని ప్రధాన ఆహారంగా చేసుకుంటున్నాం. కానీ ఉల్లిలో ఉండే ఔషధ గుణాలతో మనకు మంచి ఫలితాలు ఉన్నాయి.

మధుమేహ వ్యాధి గ్రస్తులు ఉల్లిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. రోజు 50 గ్రాముల ఉల్లి తినడం వల్ల చక్కెర అదుపులో ఉంటుంది. వైద్యులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయను తింటేనే మంచిది. రోజు 50 గ్రాముల ఉల్లిపాయ తింటే 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానమైన ఫలితం ఇస్తుంది. దీంతో ఉల్లిని డయాబెటిస్ పేషెంట్లకు దివ్య ఔషధంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఉల్లిని మన ఆహారంలో చేర్చుకోవడంతో మంచి లాభాలు వస్తాయి.
పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. గ్యాస్, ఎసిడిటి లేకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం జరిగేలా చేస్తుంది. మూత్రంలో మంట రాకుండా నిరోధిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగించే ఉల్లిని మనం క్రమం తప్పకుండా తింటే పలు రకాల మేలు కలుగుతుంది. ఉల్లి రెండు రకాలుగా ఉంటుంది. ఎర్ర, తెల్ల కలర్లలో ఉంటాయి. చాలా మంది తెల్ల ఉల్లిని తీసుకుంటారు. ఎర్ర ఉల్లి మన ఆరోగ్యానికి ఇంకా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలా ఉల్లిని నిరంతరం తీసుకుని ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లితో మనకు కలిగే మేలుతో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిని వాడుకుని లాభాలు పొందవచ్చు. రోజువారీ ఆహారంలో భాగంగా కూరల్లో కూడా ఉల్లిని బాగా వాడుకుంటాం. దీంతో ఉల్లిపాయలను తినడం వల్ల మనకు దీర్ఘకాలిక జబ్బుల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఉల్లితో మనకు కలిగే లాభాల దృష్ట్యా రోజు ఆహారంగా తీసుకుని లబ్ధి పొందాలని వైద్యులు చెబుతున్నారు.