https://oktelugu.com/

New Marriage Life:పెళ్లయిన తొలినాళ్లలో ఎలా ఉండాలంటే..?

New Marriage Life:పెళ్లంటే నూరేళ్ల పంట.. అంటారు. ఆ నూరేళ్లు కలకాలం కలిసుండాలంటే దంపతులిద్దరి మధ్య సఖ్యతా భావం ఉండాలి. పెళ్లయిన తొలినాళ్లలో కొత్త జంట అభిరురులు, అలవాట్ల ఆధారంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఆసమయంలో వారిద్దరి మనస్తత్వాలు బయటపడుతాయి. ఇలా బయటపడిన మనస్తత్వమే జీవితాంతం వారిద్దరి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అలాగే భార్యభర్తలిద్దూ బాధ్యతతో మెలిగితే ఒకరిపై ఒకరికి చెడభిప్రాయం ఉండదు. ఆ బాధ్యతలేంటో పెళ్లయిన కొత్తలోనే తెలుసుకొనగలిగాలి. అప్పుడే వారి జీవితం ఎంతో బాగుంటుంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 26, 2022 / 09:00 AM IST
    Follow us on

    New Marriage Life:పెళ్లంటే నూరేళ్ల పంట.. అంటారు. ఆ నూరేళ్లు కలకాలం కలిసుండాలంటే దంపతులిద్దరి మధ్య సఖ్యతా భావం ఉండాలి. పెళ్లయిన తొలినాళ్లలో కొత్త జంట అభిరురులు, అలవాట్ల ఆధారంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఆసమయంలో వారిద్దరి మనస్తత్వాలు బయటపడుతాయి. ఇలా బయటపడిన మనస్తత్వమే జీవితాంతం వారిద్దరి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అలాగే భార్యభర్తలిద్దూ బాధ్యతతో మెలిగితే ఒకరిపై ఒకరికి చెడభిప్రాయం ఉండదు. ఆ బాధ్యతలేంటో పెళ్లయిన కొత్తలోనే తెలుసుకొనగలిగాలి. అప్పుడే వారి జీవితం ఎంతో బాగుంటుంది.

    New Marriage Life

    దంపతులిద్దరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సమయంలో వాతావరణం కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ సమయంలో తమ గురించి, తాము చేయబోయే పనుల గురించి వివరించుకోవాలి. భవిష్యత్తులో ఏం చేయాలనుంకుంటున్నారో భాగస్వామితో చర్చించుకోవాలి. ఒకరి బలహీనతను మరొకరు తెలుసుకోవాలి. అయితే ఎదుటివారిబలహీనతలను హేళన చేయొద్దు. వారికి అలాంటి బలహీనత ఉండడానికి కారణం తెలుసుకొని గౌరవించాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు మెరుగుపడుతాయి.

    Also Read: ప్రతీ ఆడపిల్లకు ఈ పెళ్లికూతురు ఆదర్శం..ఏం చేసిందో చూడండి..

    కొత్తగా పెళ్లయిన వారి మధ్య నిత్యం సంభాషణలు ఉండాలి. చిన్న విషయమైనా కాసేపు ఇద్దరు చర్చించుకుంటే మనసుకు ఉల్లాససంగా ఉంటుంది. అయితే కొన్నాళ్ల తరువాత ఇరువు మాట్లాడుకోవడం మానేస్తారు.కానీ మొదట్లో ఈ అలవాటును ఏర్పరుచుకున్న తరువాత దానిని అలాగే కంటిన్యూ చేయాలి. ఇక పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల వారు రాకముందే దంపతులిద్దరి మధ్య ధృడత్వమైన బంధాన్ని ఏర్పరుచుకుంటే అది జీవితాంతం అలాగే ఉంటుది.

    ఇక ఒకరిపై ఒకరు బాధ్యత వహించాలి. ఒకరికి కష్టం వచ్చినప్పుడు వారిని ఆదరించాలి. పట్టించుకోనట్లు వ్యవహరిస్తే మరోసారికి మీ భాగస్వామి అలాగే చేసే అవకాశం ఉంది. వీలైతే వారికి సాయం చేసే విధంగా నడుచుకోవాలి. కొందరు పురుషులు బయట పనులు చేసి ఇంట్లో ఉండే గృహిణులపై చీదరించుకుంటారు. వారు చేసే పనులు కూడా ఎంతో విలువైనవి. అందువల్ల వారిని గౌరవిస్తూ ఉండాలి. బయట పనులు పూర్తయిన తరువాత అక్కడితో తమ బాధ్యత పూర్తయిందని అనుకోవద్దు.

    Also Read: శునకమే కనకం.. కుక్కను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మహిళ