https://oktelugu.com/

రక్తదానం చేస్తే కేజీ చికెన్ ఫ్రీ.. ఎక్కడంటే..?

దేశంలో రక్తదానం చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అధికారులు అవగాహన కల్పిస్తున్నా దేశంలోని చాలామంది రక్తదానం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతంతో పోలిస్తే రక్తదానం చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. రక్తదానం చేయడం వల్ల మనం ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపడం సాధ్యమవుతుంది. Also Read: మైగ్రేన్ తలనొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివే..? అయితే రోజురోజుకు రక్తదానం చేసే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2020 / 02:54 PM IST
    Follow us on


    దేశంలో రక్తదానం చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. అధికారులు అవగాహన కల్పిస్తున్నా దేశంలోని చాలామంది రక్తదానం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతంతో పోలిస్తే రక్తదానం చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. రక్తదానం చేయడం వల్ల మనం ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపడం సాధ్యమవుతుంది.

    Also Read: మైగ్రేన్ తలనొప్పిని సులువుగా తగ్గించే చిట్కాలివే..?

    అయితే రోజురోజుకు రక్తదానం చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని బృహన్ ముంబై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసి ఉచితంగా కిలో చికెన్ లేదా పన్నీర్ ను తీసుకెళ్లమని ప్రకటన చేసింది. సాధారణంగా రక్తదానం చేసిన వారికి పండ్లు లేదా పళ్ల రసాలు ఇవ్వడం గురించి మనం వినే ఉంటాం. కానీ చికెన్ ను ఆఫర్ చేయడం వల్ల ఎక్కువమంది రక్తదానం చేసే ఛాన్స్ ఉందని అక్కడి అధికారులు ఈ ప్రకటన చేశారు.

    Also Read: తిప్పతీగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

    జాభావ్ సాల్వీ మైదాన్‌లో ఈ నెల 16వ తేదీన జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేసి ఉచితంగా కేజీ చికెన్ లేదా పన్నీర్ ను పొందవచ్చు. కెమ్ ఆస్పత్రి నిర్వాహకులు ఈ బ్లడ్ డొనేషన్ కు సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. కార్పొరేటర్ సమాధాన్ సర్వాంకర్ కరోనా కాలంలో రక్తదానం చేసిన వారికి ఇమ్యూనిటీ పెరిగేందుకు చికెన్ ఆఫర్ ను ప్రకటించామని అన్నారు.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    కరోనా విజృంభణ వల్ల కోళ్ల పరిశ్రమ కుదేలైందని.. ఈ ఆఫర్ ద్వారా కోళ్ల పరిశ్రమకు కూడా ఉపయోగం కలుగుతుందని కార్పొరేటర్ అన్నారు. కనీసం వెయ్యి మంది రక్తదానం చేస్తారని ఆశిస్తున్నామని కార్పొరేటర్ తెలిపారు.