https://oktelugu.com/

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలు..?

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లోని బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలను అమర్చనుంది. బస్సులోని ప్రయాణికులపై నిఘా పెట్టడానికి మరియు బస్సులో తోపులాటలు, ఘర్షణలకు తావు లేకుండా చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మొదట ఔరంగాబాద్ పైలెట్ ప్రాజెక్ట్ గా కండక్టర్లకు ఈ కెమెరాలను అమర్చనున్నారు. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..? ప్రస్తుతం దేశంలోని పలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2020 / 02:33 PM IST
    Follow us on

    RTC
    మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లోని బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలను అమర్చనుంది. బస్సులోని ప్రయాణికులపై నిఘా పెట్టడానికి మరియు బస్సులో తోపులాటలు, ఘర్షణలకు తావు లేకుండా చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మొదట ఔరంగాబాద్ పైలెట్ ప్రాజెక్ట్ గా కండక్టర్లకు ఈ కెమెరాలను అమర్చనున్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..?

    ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తున్న కెమెరాల మాదిరిగా కండక్టర్లకు కెమెరాలు ఇవ్వనున్నారు. టికెట్ చెకింగ్ సమయంలో చెకింగ్ అధికారులకు ఇబ్బందులు కలగకుండా వారికి సైతం అధికారులు కెమెరాలను ఇవ్వనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర అధికారులు ఇలా బాడీ కెమెరాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 85 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    కొన్ని రోజుల క్రితం ఔరంగాబాద్ డిపోకు చెందిన మహిళా కండక్టర్లు కొందరు ప్రయాణికులు తమతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అధికారుల దృష్టికి తెచ్చారు. రోజురోజుకు ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో సమస్యకు పరిష్కారంగా అధికారులు చొక్కా జేబులకు అతికించే విధంగా ఉండే కెమెరాలను కండక్టర్లకు ఇస్తున్నారు. భవిష్యత్తులో మహారాష్ట్ర రాష్ట్రమంతటా కండక్టర్లకు ఈ తరహా కెమెరాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    ఔరంగాబాద్‌ స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు త్వరలోనే కండక్టర్లు కెమెరాను తప్పనిసరిగా కలిగి ఉండాలనే నిబంధనలు అమలులోకి రానున్నాయని వెల్లడించారు. మాజీ సైనిక సిబ్బందిని అధికారులు లైన్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించి ఆర్టీసీ బస్సులపై నిఘా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.