Milk: బర్రెపాలకు, ఆవుపాలకు మధ్య తేడా ఇదే.. ఏవి మంచివంటే?

Milk: శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిరోజూ పాలు తాగాలని సూచనలు చేస్తూ ఉంటారు. పాల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పాల ద్వారా విటమిన్ డితో పాటు కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది కాబట్టి ప్రతిరోజూ పాలు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఆవు పాలు, బర్రె పాలలో ఏవి మంచివనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి ఆవు పాలు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు శాతం ఆవుపాలలో […]

Written By: Kusuma Aggunna, Updated On : December 7, 2021 3:38 pm
Follow us on

Milk: శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిరోజూ పాలు తాగాలని సూచనలు చేస్తూ ఉంటారు. పాల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. పాల ద్వారా విటమిన్ డితో పాటు కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది కాబట్టి ప్రతిరోజూ పాలు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ఆవు పాలు, బర్రె పాలలో ఏవి మంచివనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి.

Buffalo and Cow Milk

ఆరోగ్యానికి ఆవు పాలు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు శాతం ఆవుపాలలో తక్కువగా ఉంటుంది. ఆవు పాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అధిక బరువును నియంత్రిస్తాయి. ఆవుపాలలో చక్కెర, కుంకుమ పువ్వు కలిపి తాగితే పైల్స్ సమస్య దూరమవుతుంది. బర్రె పాలలో 7 నుంచి 8 శాతం కొవ్వు ఉండగా ఆవుపాలలో 3 నుంచి 4 శాతం కొవ్వు ఉంటుంది. ఆవుపాలతో పోలిస్తే బర్రెపాలు చిక్కగా ఉంటాయనే విషయం తెలిసిందే.

బర్రె పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతో పాటు ఈ పాలు త్వరగా జీర్ణం కావు. బర్రె పాలు ఊబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి. ఆవుపాలతో పోలిస్తే గేదె పాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఆవుపాలలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉండటంతో పాటు ఈ పాలు పిల్లల్లో జ్ఞాపకశక్తికి తోడ్పడతాయి. ఆవుపాలను పిండిన తర్వాత రెండు రోజులలోగా తాగాలి.

Also Read: PM Ujjwala Yojana: ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నారా.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఒక గ్లాస్ బర్రె పాలలో 237 కేలరీలు ఉంటే ఒక గ్లాస్ ఆవుపాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆవు పాలు, బర్రె పాలు రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పవచ్చు. మన అవసరాలను, పాలను ఉపయోగించే తీరును బట్టి ఆవు పాలు, గేదె పాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Health Tips: గుడ్లను ఎక్కువగా తింటున్నారా.. ఈ తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?