Cancer: ముంచుకొస్తోంది క్యాన్సర్ ప్రమాదం..మగాళ్ళూ.. మీ స్పెర్మ్ కౌంట్ తగ్గితే అంతే సంగతులు

ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఉటా పరిశోధకులు కొంతమంది మీద అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారం మిల్లీలీటర్ వీర్యం లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కంటే తక్కువ స్పేర్మికౌంటు ఉన్న పురుషుల్లో వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 134 శాతం ఉంటుంది.

Written By: Velishala Suresh, Updated On : March 12, 2024 3:47 pm

Cancer

Follow us on

Cancer: పీల్చేగాలి, తాగే నీరు, తినే తిండి.. ఇవన్నీ మారిపోయాయి. మన జీవనశైలి కూడా సమూల మార్పులకు గురైంది. ఇది పురుషుల సంతానోత్పత్తిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అది కేవలం సంతానోత్పత్తి పై మాత్రమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా కారణమవుతుందట. ఇటీవల పరిశోధనలో ఇది తేలింది. తక్కువ వీర్యం ఉత్పత్తి కావడం.. లేదా వీర్యం ఉత్పత్తి కాని పురుషుల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందట. వీర్యం లేని పురుషులు ఎముకలు, కీళ్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 156% ఉంటుందట.. థైరాయిడ్ వంటి క్యాన్సర్లు కూడా సోకే ప్రమాదం ఉంటుందట.

ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఉటా పరిశోధకులు కొంతమంది మీద అధ్యయనం నిర్వహించారు. దాని ప్రకారం మిల్లీలీటర్ వీర్యం లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కంటే తక్కువ స్పేర్మికౌంటు ఉన్న పురుషుల్లో వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 134 శాతం ఉంటుంది. ఎముక, కీళ్ల క్యాన్సర్ సోకే ప్రమాదం 143% దాకా ఉంటుంది. వాస్తవానికి మగవాళ్ళల్లో వృషణ క్యాన్సర్ సర్వసాధారణం అయినప్పటికీ.. తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్న పురుషుల్లో ఈ రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుందని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ప్రకటించారు.

వైద్య పరిభాషలో తక్కువ స్పెర్మ్ కౌంట్ ను ఒలిగో స్పెర్మియా అంటారు. ఎక్కువ ఫోన్ చూడటం, ల్యాప్ టాప్ వాడటం, ధూమపానం, మద్యం తాగడం, ఊబకాయం, దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సలు, హార్మోలలో సమతుల్యంలోపించటం.. వంటివి తక్కువ స్పేర్మ్ కౌంట్ లేదా ఒలిగో స్పెర్మియాకు దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 16 మిలియన్/ మి. లీ కంటే తక్కువ ఉంటే దానిని తక్కువ స్పెర్మ్ కౌంట్ అని పిలుస్తారు. ఇలా ఉన్న వారికి పిల్లలు పుట్టరు. అయితే తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు నేరుగా క్యాన్సర్ బారినపడరు. కాకపోతే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాంటప్పుడు హార్మోన్ చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం, మంచి ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటి అలవాట్ల ద్వారా ఒలిగో స్పెర్మియా ను అధిగమించవచ్చు. ఒలిగో స్పెర్మియాను అధిగమించినతమాత్రాన పిల్లలు పుట్టరు. అలాంటివారు అసిస్టెంట్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వంటి విధానాల ద్వారా తల్లిదండ్రులు కావచ్చు.