https://oktelugu.com/

Pani Puri :  పానీ పూరీ తింటే ప్రమాదమంటున్న వైద్య నిపుణులు.. మధుమేహం వస్తుందంటూ?

Pani Puri :  చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అందరూ పానీ పూరీని ఇష్టపడతారు. స్పైసీగా ఉండే పానీ పూరీని తినడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రాత్రి సమయంలో భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతామని భావించే వాళ్లకు పానీ పూరీపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల స్ట్రీట్ ఫుడ్ అయిన పానీ పూరీని కొంతమంది మాత్రం తినలేకపోతున్నారు. అయితే పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహం మాత్రం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2022 / 09:12 AM IST
    Follow us on

    Pani Puri :  చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అందరూ పానీ పూరీని ఇష్టపడతారు. స్పైసీగా ఉండే పానీ పూరీని తినడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రాత్రి సమయంలో భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతామని భావించే వాళ్లకు పానీ పూరీపై ఆసక్తి చూపుతున్నారు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల స్ట్రీట్ ఫుడ్ అయిన పానీ పూరీని కొంతమంది మాత్రం తినలేకపోతున్నారు. అయితే పానీ పూరీ ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహం మాత్రం చాలామందిలో ఉంది.

    పాకశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం 17వ శతాబ్ధంలో తొలిసారి పానీ పూరీ తయారైంది. అప్పటి రాజ వైద్యులు కారంతో చేసిన స్నాక్స్ ను యమునా నది నీటిలో ఆల్కలీన్ పరిమాణాన్ని సమతుల్యం చేయడానికి తీసుకోవాలని సూచించడంతో పానీ పూరీ, చాట్ మసాలా పుట్టుకొచ్చిందని సమాచారం. ప్రస్తుత భారతీయుల ఆహారంలో పానీ పూరీ కూడా ఒక భాగమైందని చెప్పవచ్చు. అయితే వైద్య నిపుణులు మాత్రం పానీ పూరీ ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.

    మైదాపిండి సహాయంతో ఈ పూరీలను తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. మైదా పిండితో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ వంటకాలను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలతో పాటు బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే పానీ పూరీని అప్పుడప్పుడూ తీసుకోవడం వల్ల మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు. గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు , మ‌ధుమేహం సమస్యలతో బాధపడే వాళ్లకు పానీ పూరీ మంచిది కాదు.

    పానీ పూరీ తినడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పానీ పూరీలను ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య అయిన మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు పానీపూరీ తినకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు.