spot_img
Homeహెల్త్‌Skin Care : ఈ ఆయిల్స్‌తో చర్మానికి మసాజ్ చేయండి.. అందం పెంచుకోండి

Skin Care : ఈ ఆయిల్స్‌తో చర్మానికి మసాజ్ చేయండి.. అందం పెంచుకోండి

Skin Care : అందంగా ఉండాలని చాలా మంది స్కీన్ కి ఎన్నో రకాల క్రీమ్ లు రాస్తుంటారు. దీనికోసం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని వాడతారు. అయితే వీటిని వాడటం వల్ల ఎక్కువగా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని వాడక పోవడం మంచిది. మరి చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు కాంతిమంతంగా ఉండాలంటే కొన్ని సహజ పద్ధతులు పాటించాలి. అప్పుడే స్కిన్ బాగుంటది. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ కూడా అందంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లు ఎక్కువగా రసాయనాలు ఉండే వాటిని ఉపయోగిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా అందాన్ని పెంచుకునే కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి పాటిస్తే తప్పకుండా స్కిన్ గ్లోగా ఉంటుంది. ఆయిల్స్ కేవలం జుట్టుకి మాత్రమే కాకుండా స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడతాయి. డైలీ ఆయిల్స్ తో చర్మానికి మసాజ్ చేస్తే స్కిన్ తప్పకుండా మారుతుంది. మరి ఏ ఆయిల్స్ తో మసాజ్ చేస్తే స్కిన్ అందంగా తయారవుతుందో చూద్దాం.

ఆలివ్ ఆయిల్
చర్మాన్ని అందంగా పెంచడంలో ఆలివ్ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ స్నానం చేసే ముందు లేదా తర్వాత ఆలివ్ ఆయిల్ తో చర్మాన్ని మసాజ్ చేస్తే ముడతలు పోతాయి. ఈ నూనెతో మసాజ్ చేస్తే.. శరీరంలోని కండరాలు అన్ని బలంగా తయారవుతాయి. చిన్న పిల్లలకి రోజూ ఈ ఆయిల్ అప్లై చేస్తే మృదువుగా తయారవుతుంది. వీటితో పాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే బీపీ, గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. ఈ ఆయిల్ తో చర్మాన్ని మర్దన చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నువ్వుల నూనె
ఈ నూనెను జుట్టుకి కూడా రాసుకోవచ్చు. తలకి లేదా చర్మానికి రాయడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. నాఢీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలాగే రోజూ ఈ ఆయిల్ రాసుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది.

నిమ్మగడ్డి నూనె
నిమ్మగడ్డి ఆయిల్ తో రోజూ చర్మానికి మసాజ్ చేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు రోజూ ఈ ఆయిల్ ని స్కిన్ కి అప్లై చేసుకోవడం మంచిది.

బాదం నూనె
చర్మ సౌంర్యాన్ని పెంచడంలో బాదం నూనె బాగా సాయపడుతుంది. ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం తేమ పోయి అందంగా ఉంటుంది. కనీసం వారానికి ఒకసారి అయిన బాదం నూనె అప్లై చేయడం చాలా బెటర్.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version