https://oktelugu.com/

‘AAY’ Movie : ‘ఆయ్’ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ప్రేక్షకులకు ఇక పండగే!

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయనున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచి, ఓటీటీ లో ఫ్లాప్స్ అయ్యాయి. మరి 'ఆయ్' చిత్రం కూడా అలా అవుతుందా?, లేదా థియేటర్స్ లో లాగానే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2024 / 11:04 PM IST

    Aay Movie Collection

    Follow us on

    ‘AAY’ Movie : ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి ఘనవిజయం సాదిస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్న పెద్ద సినిమాలకంటే, చిన్న సినిమాల కారణంగానే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కానక వర్షం కురుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 వ తారీఖుని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’ మరియు ‘ఆయ్’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ మరియు ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. ఇక తమిళ హీరో విక్రమ్ సినిమాలకు సాధారణంగానే మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఉంటాయి అనే విషయం అందరికి తెలిసిందే.

    అలా ఆయన నటించిన ‘తంగలాన్’ చిత్రం కూడా అదే రోజు విడుదలైంది. ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన ‘ఆయ్’ చిత్రం అసలు విడుదల అయ్యిందనే విషయం కూడా చాలా మందికి తెలీదు. కానీ ఆ చిత్రమే చివరికి విన్నర్ గా నిల్చింది. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు లేకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ సినిమాని నిర్మించేందుకు కేవలం కోటి రూపాయిల బడ్జెట్ మాత్రమే అవసరమైంది. అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. సినిమా విడుదలకు ముందు ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ సినిమా గురించి ట్విట్టర్ లో ట్వీట్లు వేశారు. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ పెద్ద హీరోల సినిమాల హంగామా కారణంగా మొదటి రోజు ఈ చిత్రానికి రావాల్సిన బజ్ రాలేదు. థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని అలరించేందుకు అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది.

    ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా మీడియా సంస్థలు భారీ రేట్ కి కొనుగోలు చేసాయి. థియేటర్స్ లో విడుదలైన ఆరు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి అనే ఒప్పందం ఉండడంతో, ఈ సినిమాని సెప్టెంబర్ 18 వ తారీఖున విడుదల చేయనున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే చేయనున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచి, ఓటీటీ లో ఫ్లాప్స్ అయ్యాయి. మరి ‘ఆయ్’ చిత్రం కూడా అలా అవుతుందా?, లేదా థియేటర్స్ లో లాగానే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి.