Cardamom Benefits: యాలకుల గురించి చాలా మందికి తెలియని నిజాలు

మన వంటింట్లో లభించే యాలకులతో మనకు ఎన్నో లాభాలున్న సంగతి తెలియదు. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, కాల్సియం, మినరల్స్, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. యాలకులు శరీరానికి మల్టీ విటమిన్ టాబ్లెట్ లా పనిచేస్తాయని చెబుతుంటారు ఆయుర్వేద వైద్యులు.

Written By: Srinivas, Updated On : July 6, 2023 2:28 pm

Cardamom Benefits

Follow us on

Cardamom Benefits: మన ఇల్లే మనకు వైద్యశాల. మన ఇంట్లో ఉండే వాటిలో చాలా వరకు రోగాలను నయం చేసేవే ఉంటాయి. కానీ వాటిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. పట్టించుకోవడం లేదు. మన వంటింట్లో ఉండే వాటిలో ఉప్పు తప్ప అన్ని మనకు పనికొచ్చేవే. ఉల్లి, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇలా ఒకటేమిటి అన్ని మనకు నిత్యం ఎంతో మేలు చేస్తాయి. కానీ మనం వాటి గుణాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాం. దీంతో రోగాల బారిన పడుతున్నాం.

పోషకాలు

మన వంటింట్లో లభించే యాలకులతో మనకు ఎన్నో లాభాలున్న సంగతి తెలియదు. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, కాల్సియం, మినరల్స్, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. యాలకులు శరీరానికి మల్టీ విటమిన్ టాబ్లెట్ లా పనిచేస్తాయని చెబుతుంటారు ఆయుర్వేద వైద్యులు.

మసాలా దినుసుల్లో..

మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో ఇవి ఒకటి. కానీ ఇందులో ఉండే గుణాలతో మనం చాలా రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. దేవాలయాల్లో చేసే ప్రసాదాల్లో వీటిని వాడతారు. లడ్డూల తయారీలో ఎక్కువగా వేస్తుంటారు. ఇంకా మనం తీసుకునే తీర్థంలో కూడా వీటిని కలిపి ఇస్తుంటారు. దేవాలయానికి వచ్చిన భక్తుడికి ఆరోగ్యం ప్రసాదించాలనే ఉద్దేశంతోనే అందులో వీటిని కలుపుతారు.

నోటి దుర్వాసన

కొందరికి నోరు వాసన వస్తుంది. బ్రష్ చేసుకున్నా లోపల క్రిములు మిగిలిపోయి దుర్వాసన వస్తుంటుంది. దీంతో ఎవరి ముందర మాట్లాడటానికి జంకుతుంటారు. అలాంటి నోటి దుర్వాసనను దూరం చేసే ఔషధాల్లో ఇది ఒకటి. నోటి దుర్వాసన ఉన్న వారు బ్రష్ చేసుకున్న వెంటనే రెండు యాలకులు మరియు రెండు పుదీనా ఆకులు నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన మాయమవుతుంది. ఇది సులభమైన పరిహారం కచ్చితంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.