Problems With Non Stop Using Masks: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల మాస్క్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు భయపడి కొంతమంది గంటల తరబడి మాస్క్ ను తీయకుండా ఉంచుకుంటున్నారు. అయితే నాన్ స్టాప్ గా మాస్క్ ను వాడటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఎవరైతే మాస్క్ ను కంటిన్యూగా వాడతారో వాళ్లలో లాలాజలం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
మాస్క్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లలో దంత సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ను ఎక్కువగా వినియోగించడం వల్ల కొంతమంది నోటి దుర్వాసన సమస్యతో బాధ పడుతుంటే మరికొందరు చిగుళ్ల నొప్పి బారిన పడుతున్నారు. వాడిన మాస్క్ ను మళ్లీ వాడటం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది.
రోజులో మాస్క్ ను ఎక్కువ సమయం ధరించడం వల్ల మంచినీళ్లను తక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియా వేర్వేరు ఇన్ఫెక్షన్లకు కారణం కావడంతో పాటు గుండె రక్తనాళాల పనితీరును దెబ్బతీసి గుండెపోటుకు కారణమవుతుందని తెలుస్తోంది. మాస్కులు గంటల తరబడి వాడేవారు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఎన్95 మాస్కును వాడేవాళ్లు అదనంగా మరో క్లాత్ మాస్క్ ను వినియోగిస్తే మంచిది. రీయూజబుల్ మాస్కులను శుభ్రపరిచిన తర్వాతే మళ్లీ వాడాలి. చుట్టూ ఎవరూ లేని సమయంలో మాస్క్ వాడకపోయినా ఇబ్బందులు ఉండవు. ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.