దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు టైప్ 2 డయాబెటిస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ బారిన పడటానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుకుంటే మాత్రమే షుగర్ వల్ల వచ్చే ఇతర సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఎక్కువ బరువు ఉన్నవాళ్లు షుగర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే..?
శరీర బరువుకు డయాబెటిస్ కు సంబంధం ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే తక్కువ బరువు లేదా సహజ బరువు ఉన్నవారికి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మాత్రం షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మందులు తీసుకోవడంతో పాటు ఆహార నియంత్రణ పాటించాలని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
Also Read: జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
చాలామంది డయాబెటిస్ బారిన పడినా ఆలస్యంగా గుర్తించడం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి తప్పనిసరిగా షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. ప్రారంభంలోనే డయాబెటిస్ ను గుర్తిస్తే నియంత్రించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో డయాబెటిస్ ను చెక్ చేసుకోకపోతే మాత్రం షుగర్ లెవెల్స్ మరింత పెరిగి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
తరచూ అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలలో మార్పులు కూడా డయాబెటిస్ బారిన పడటానికి కారణమవుతాయి.