https://oktelugu.com/

Love Marriage Vs Arranged Marriage: ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? ఏది బెటర్?

ప్రేమ వివాహాల్లో పెద్దల ప్రమేయం ఉండదు. వారు ఒప్పుకోకపోతేనే జంటలు పోలీసులను ఆశ్రయించి వారి సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ లు పెద్దలు కుదిర్చినవి. దీంతో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దలు కల్పించుకుని సర్ది చెబుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 9, 2023 / 04:48 PM IST

    Love Marriage Vs Arranged Marriage

    Follow us on

    Love Marriage Vs Arranged Marriage: పెళ్లిళ్లలో చాలా రకాలు ఉంటాయి. మన దేశంలో ఉన్న ఆచార వ్యవహారాల్లో పెళ్లి అనే తంతుకు మనం ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని చెబుతుంటారు. మన వివాహ వ్యవస్థలో పెళ్లిళ్లు ఎన్నో రకాలుగా చేస్తుంటారు. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు, గాంధర్వ వివాహాలు, స్వయం వరం వంటి వాటిని మనం ఇదివరకు విన్నాం. కానీ ఇందులో అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజెస్ రెండు రకాలు మాత్రం చూస్తుంటాం.

    రెండింటిలో తేడా

    ప్రేమ వివాహాల్లో పెద్దల ప్రమేయం ఉండదు. వారు ఒప్పుకోకపోతేనే జంటలు పోలీసులను ఆశ్రయించి వారి సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ లు పెద్దలు కుదిర్చినవి. దీంతో వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దలు కల్పించుకుని సర్ది చెబుతారు. చక్కగా కాపురం చేసుకోవాలని సలహా ఇస్తారు. ప్రేమ వివాహాల్లో పెద్దల ప్రమేయం ఉండదు. అందుకే చాలా మంది ప్రేమికులు వివాహం తరువాత విడాకులు తీసుకుంటున్నారు.

    ఏది బెటర్

    ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో ఏది మంచిదనే అభిప్రాయాల్లో అరేంజ్డ్ మ్యారేజెస్ కే ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. చాలా మంది జంటలు దీన్నే అనుసరిస్తున్నారు. ప్రేమ వివాహంలో సమస్యలు వస్తే తీర్చే వారే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లనే కావాలనుకుంటున్నారు.

    పెద్దలు కుదిర్చిన వివాహంలో..

    పెద్దలు చేసే పెళ్లికి బలం ఎక్కువగా ఉంటుంది. రెండు కుటుంబాల్లో పెద్దలు దంపతులకు ఏ కష్టం వచ్చినా పరిష్కరిస్తుంటారు. దీంతో అరేంజ్డ్ మ్యారేజెస్ కలకాలం నిలుస్తాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ వివాహాల కంటే పెద్దలు చేసే వివాహాలకే విలువ ఎక్కువ అని వెల్లడిస్తున్నారు.