కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత చాలామంది ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రోజూ అరటిపండు తినడం ద్వారా ఇమ్యూనిటీని సులువుగా పెంచుకోవచ్చు. అరటిపండ్ల ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అరటి సాగు ద్వారా సులభంగానే లక్షల రూపాయలు సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో అరటిపండ్లు సహాయపడతాయి.
అరటి సాగు చేయాలనుకునే వాళ్లు మంచి నేలను ఎంచుకోవడంతో పాటు మొక్కకు మొక్కకు ఆరడుగుల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. అరటి సాగు కోసం ఎకరాకు లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు కాగా అరటి సాగు ద్వారా 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అరటి మొక్కలు నాటాలంటే 50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉన్న గుంతలను తీయాలి.
15 రోజుల తర్వాత 10 కిలోల ఆవు పేడ, 250 గ్రాముల వేప, 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుంతలలో వెసి అరటి మొక్కలను నాటాలి. నీటి లభ్యత ఆధారంగా తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటి పండ్ల ద్వారా గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గించడంలో అరటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి.
అరటి అద్భుతమైన అల్పాహారం కాగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో అరటి పండ్లు సహాయపడతాయి. కండరాల తిమ్మిరి సమస్యకు అరటిపండ్లు తినడం ద్వారా సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది.