https://oktelugu.com/

25న దూసుకొస్తోంది: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు

విశ్వంలో మరో వింత జరగనుంది. భూమికి దగ్గరగా ఓ ఉల్క ప్రయాణించనుంది. తాజ్ మహల్ కంటే మూడు రేట్లు ఉండే ఈ ఉల్క భూమికి అతి దగ్గరగా ప్రయాణించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. భారత కాలమాన ప్రకారం ఈనెల 25న తెల్లవారు జామున 3 గంటలకు భూమి దగ్గరిని నుంచి వెళ్తుందని చెప్పింది. భూమికి 3.7 మిలియన్ కిలోమీటర్ల పై నుంచి ఈ ఉల్క ప్రయాణించనుంది. నాసా లెక్కల ప్రకారం భూమికి, చంద్రుడికి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2021 / 10:48 AM IST
    Follow us on

    విశ్వంలో మరో వింత జరగనుంది. భూమికి దగ్గరగా ఓ ఉల్క ప్రయాణించనుంది. తాజ్ మహల్ కంటే మూడు రేట్లు ఉండే ఈ ఉల్క భూమికి అతి దగ్గరగా ప్రయాణించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. భారత కాలమాన ప్రకారం ఈనెల 25న తెల్లవారు జామున 3 గంటలకు భూమి దగ్గరిని నుంచి వెళ్తుందని చెప్పింది. భూమికి 3.7 మిలియన్ కిలోమీటర్ల పై నుంచి ఈ ఉల్క ప్రయాణించనుంది.

    నాసా లెక్కల ప్రకారం భూమికి, చంద్రుడికి మధ్య దూరం 190 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఏ వస్తువు వచ్చినా అది భూమి దగ్గరికి వచ్చినట్లే. అది భూమి గుండా ప్రయాణిస్తుందని లెక్కగడుతారు. అయితే ఇలాంటి ఉల్కలు ప్రయాణించేటప్పుడు ప్రమాదం ఎదురుకాకుండా సానా అందుకు రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. ఉల్కల నుంచి ఎదుర్కొనేందుకు డార్ట్ మిషన్ ను రెడీగా ఉంచింది. దీనిని ఉపయోగించి ఉల్కలను భూమిపైకి రాకుండా మళ్లిస్తారు.

    గత నవంబర్లో నాసా డబుల్ అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ ను మిషన్లో అంతరిక్షానికి పంపడానికి ప్లాన్ వేసింది. ఇది సెకనుకు 6.6 కిలోమీటర్ల వేగంతో 780 మీటరల్ పరిమాణంలో ఉన్న అస్టరాయిడ్ డిడిమోస్ మూన్ లెట్ పై ఢీకొడుతుంది. అదృష్టవశాత్తూ ప్రమాదకరమైన ఇలాంటి గ్రహాలను ఎదుర్కొనేందుకు లేదా ఉల్కలను దారి మళ్లించేందుకు రక్షణ వ్యవస్థను నాసా రెడీ చేసింది. ఈ నేపథ్యంలో 25న జరిగే ఉల్కను నాసా ఏ విధంగా ఎదుర్కోగలదోనన్న ఆసక్తి నెలకొంది.