Pregnancy: పెళ్లి ఆ తర్వాత పిల్లలు.. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే సాదారణమైన ప్రక్రియ. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కాస్త లేట్ అయితే వామ్మో సమాజం నుంచి ఎదుర్కొనే ప్రశ్నలకు భయపడాల్సిందే. ప్రస్తుత ఆహార అలవాట్లు, వాతావరణంలో మార్పులు అన్నింటి దృష్ట్యా ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఇక ఇందులో భాగంగానే పిల్లలు పుట్టడం కూడా కష్టంగానే మారింది. దీనివల్ల హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చి పడింది. అయితే ఎంతో ఎదురుచూపు తర్వాత పీరియడ్స్ మిస్ అయ్యాయా?
పీరియడ్స్ మిస్ అయితే వెంటనే సంతోషంగా టెస్ట్ చేసుకుంటారు. కొందరికి పెళ్లి తర్వాత వెంటనే పిల్లలు వద్దు అనే ఆలోచన కూడా ఉంటుంది. ఏది ఏమైనా టెస్ట్ లో లైన్ కాస్త లైట్ గా వస్తే సంతోష పడాలో.. బాధ పడాలో అర్థం కాదు. ఇంతకీ ఈ లైన్ అర్థం ఏమిటి? ఒక లైన్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదు అనుకుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో మాత్రం పాజిటివ్ గా కాకుండా, నెగిటివ్ గా కాకుండా వీక్ లైన్ వస్తుంది. మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు.
పీరియడ్స్ కు ముందే ప్రెగ్నెన్సీ వస్తుందా? లేదా? అనే యాంగ్జైటీ వల్ల కూడా వీక్ లైన్ వస్తుందట. కొందరికి పీరియడ్స్ సమయానికి రాకపోవచ్చు. అంటే ఎగ్ రిలీజ్ విడుదల ఆలస్యంగా అవుతుంది. అలాంటి సమయంలో కూడా వీక్ లైన్ వస్తుంది. అందుకే పీరియడ్స్ మిస్ అయిన వెంటనే టెస్ట్ చేసుకుంటే వీక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్యులు. కొన్ని సందర్భాలలో బేబీ గ్రోత్ ఎక్కువగా లేని సమయంలో, ముందుగా అబార్షన్ అయిన సందర్భంలో కూడా ఇలాంటివి సంభవిస్తాయట.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లో కూడా వీక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందట. సో లైట్ లైన్ వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా మీ ఆరోగ్యాన్ని మానసిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోండి. లేదంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ను సంప్రదించండి. కానీ ఈ సమయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. వీక్ లైన్ స్ట్రాంగ్ అయ్యే వరకు జాగ్రత్త. మీకు కూడా ఇలాంటి వీక్ లైన్ వచ్చిందా? అయితే కంగ్రాచ్యులేషన్స్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బేబీ.