Sleeping Problem: నిద్ర ప్రతీ జీవరాశికి అత్యంత ముఖ్యమైనది. ఒక రోజు ఆహారం లేకున్నా ఉండగలమేమో కానీ, ఒక రోజు నిద్ర లేకుండా ఉండలేము. అంతగా మనిషి జీవితంలో నిద్రకు ప్రాధాన్యం ఉంది. అయితే ఆన్‌డ్రాయిడ్ ఫోన్లు వచ్చాన నిద్రలేమి పెరుగుతోంది. కొందరు వివిధ సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. ఇంకొందరు నిద్రపోయే సమయంలో ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో సరిపడా నిద్రపోవడం లేదు. ఇక వ్యాధిగ్రస్తులు కూడా బాధతో నిద్ర పోవడం లేదు. కానీ, ప్రతి మనిషి ఏడు గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం 5 గంటల నిద్రం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.
జ్ఞాపకశక్తిపై ప్రభావం..
నిద్రలేమి మన జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్రలేకపోతే మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయదని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో జ్ఞాపక శక్తి తగ్గుతుందని నెదర్లాండ్ల్‌ని గ్రానింగన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ హావెక్స్ తెలిపారు. నిద్రలేమి మెదడులోని నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు ఎలుకలపై పరివోధన చేశారు.
5 గంటల నిద్ర తప్పనిసరి
పరిశోధనలో భాగంగా రోజుకు ఐదు గంటల నిద్ర తప్పనిసరి అని తేల్చారు. నిద్ర లేకపోవడంతో మెదడులోని నాడీ వ్యవస్థై ఏవిధంగా ప్రభావం చూపుతుందో గుర్తించారు. నిద్రలేమితో ఎలుకల మెదడులోని అణువులు సక్రమంగా పనిచేయకపోవడం అది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
సాధారణ సమస్యగా..
ప్రస్తుతం ఆధునిక సమాజంలో నిద్రలేమి ఓ సాధారణ సమస్యగా మారిందని, దీనిద్వారా ఆరోగ్య సమస్యలు, మెదడు పనితీరుపైనా ప్రభావం ఉంటుందని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త టెడ్ అబెల్ తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలను ఈలైఫ్ జర్నల్‌లో ప్రచురించారు.