Summer Health Tips: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవాలి.
వేసవి కాలంలో ఆహారంలో భాగంగా పెరుగును తీసుకోవడం మంచిదా? మజ్జిగను తీసుకోవడం మంచిదా? అనే ప్రశ్నకు వైద్యులు పెరుగు కంటే మజ్జిగే మంచిదని చెబుతున్నారు.
వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉప్పు లేదా చక్కెర కలుపుకుని మజ్జిగను తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. విటమిన్లు, ఖనిజాల విషయంలో పెరుగు, మజ్జిగ మధ్య పెద్ద తేడా ఉండదనే సంగతి తెలిసిందే. శరీరానికి వేడి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించడంలో మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మజ్జిగను ఆహారంలో భాగం చేసుకుంటే మరింత ఎక్కువగా బెనిఫిట్స్ ను పొందవచ్చు. మజ్జిగ శరీరం ప్రోటీన్లను శోషించుకునే విషయంలో ఉపయోగపడుతుంది. మజ్జిగ అన్నంతో పాటు ఉల్లిపాయను తీసుకుంటే మరింత ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు మజ్జిగ అన్నం తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి.
ఒంటికి చలువ కోసం మజ్జిగను తీసుకుంటే మంచిది. మజ్జిగ అన్నం తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కడుపులో బాధ, నొప్పి సమస్యలు ఉంటే మాత్రం పుల్లని మజ్జిగను తాగడానికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.