Food Knowledge: మనం తినే ఈ ఆహార పదార్థాలకు ఎక్స్‏పైరీ డేట్ ఉండదట.. అవేంటంటే?

Food Knowledge: మనలో చాలామంది కొన్ని ఆహార పదార్థాలను ఎక్స్‏పైరీ డేట్ చూసి మరీ తింటూ ఉంటారు. ఎక్స్‏పైరీ డేట్ దాటితే ఆహార పదార్థాల రుచి, నాణ్యత తగ్గడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలకు మాత్రం ఎక్స్‏పైరీ డేట్ ఉండదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని ఆహార పదార్థాలు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్నా మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. మనం ఎంతో ఇష్టపడే వాటిలో […]

Written By: Navya, Updated On : March 30, 2022 10:35 am
Follow us on

Food Knowledge: మనలో చాలామంది కొన్ని ఆహార పదార్థాలను ఎక్స్‏పైరీ డేట్ చూసి మరీ తింటూ ఉంటారు. ఎక్స్‏పైరీ డేట్ దాటితే ఆహార పదార్థాల రుచి, నాణ్యత తగ్గడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలకు మాత్రం ఎక్స్‏పైరీ డేట్ ఉండదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని ఆహార పదార్థాలు ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకున్నా మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.

Water

మనం ఎంతో ఇష్టపడే వాటిలో ఒకటైన తేనె ఎంతకాలం నిల్వ ఉంచినా పాడవదు. అయితే సేంద్రీయ తేనె మాత్రమే ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన తేనె మాత్రం తక్కువ సమయంలోనే పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒకవేళ తేనె పాడవుతుందని గమనిస్తే ఆ తేనె కల్తీ తేనె అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కల్తీ తేనె మాత్రమే పాడవటం లేదా గడ్డ కట్టడం జరుగుతుంది.

Also Read: CM YS Jagan: ఆ కేసులో జ‌గ‌న్‌కు రిలీఫ్.. కానీ ఇదేం తీరు..

పచ్చళ్లు, ఊరగాయలు సైతం ఎంత కాలమైనా నిల్వ ఉంటాయి. అయితే పచ్చళ్లు, ఊరగాయలకు నీళ్లు తగలకూడదు. ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉన్నా చెడిపోవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత కాలం నిల్వ ఉంచినా ఉప్పు, చక్కెర పాడవవు. గాలిరకం కంటైనర్లలో వీటిని నిల్వ చేస్తే మంచిది. ఆవాలు సైతం ఎన్నిరోజులు నిల్వ చేసిన అస్సలు పాడవవు.

ఎక్కువ కాలం వీటిని నిల్వ ఉంచిన వాళ్లు ఎలాంటి టెన్షన్ లేకుండా వీటిని వినియోగించవచ్చు. బియ్యం సైతం ఎంత ఎక్కువకాలం ఉంటే అంత రుచిగా ఉంటుంది. వైట్ రైస్ ను ఎంతకాలం నిల్వ చేసినా ఎలాంటి సమస్య ఉండదు. ఎప్పటికీ గడువు లేని ఈ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినా తీసుకోవచ్చు.

Also Read: Clarifications Given To CAG On Rs 48K Cr: సర్కారి వారి పైసల్: రూ.48వేల కోట్లు జగన్ సర్కార్ ఏం చేసింది?