Kitchen Tips For Omicron: ప్రస్తుతం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల భయం జనంలో ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరో వైపున కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వలన శ్వాస కోశ ఇబ్బందులు వచ్చే చాన్సెస్ అంతగా లేవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ జనం కొంత భయపడుతున్నారు. కాగా, వారు అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఇంటి దగ్గరే ఉండే కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ బారి నుంచి బయటపడొచ్చని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.
కొవిడ్ లక్షణాలైనటువంటి తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, జలుబు, దగ్గు, తదితర సాధారణ సమస్యలను ఇంట్లో వాడే పదార్థాలతోనే తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వారు చెప్పిన చిట్కలు ఏంటంటే..
దగ్గు కాని జ్వరం కాని జలుబు కాని ఉన్నట్లయితే అమృత(గుడూచి) ఆకుల రసం తీసుకోవాలని చెప్తున్నారు. ఈ ఆకుల రసాన్ని దంచి టీ స్పూన్ చొప్పున మూడు పూటలా వీటిని తీసుకోవాలి. ఇలా ఐదు రోజులు చేస్తే చాలు.. మీకున్న జ్వరం, గొంతు నొప్పి ఇట్టే తగ్గిపోతాయి. ఒకవేళ ఆకులరసం తాగడం ఇబ్బందిగా అనిపించినట్లయితే మహాలక్ష్మి విలాసరస్, లక్ష్మీ విలాసరస్ ట్యాబ్లెట్స్ మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్ లో ఐదు రోజుల పాటు రోజుకు రెండు వేసుకోవాలి.
Also Read: ఒమిక్రాన్ సోకిందా.. కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
అనగా పొద్దున ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు..
ఇకపోతే దగ్గు తగ్గడానికి వంటింటి ఔషధమైన మిరియాలను తీసుకోవాల్సి ఉంటుంది. మిరియాలను దంచి తులసి ఆకుల రసంలో కలిపి మార్నింగ్, ఈవినింగ్ చెంచడు నాలుగు రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వారం రోజుల పాటు తీసుకుంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది. శొంఠిని అరగదీసి కణతలపై రాసుకున్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.
పుదీనా ఆకుల, తమలపాకు ఆకుల రసం తీసి మార్నింగ, ఈవినింగ్ టైమ్స్ లో చెంచడు చొప్పున తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు తగ్గిపోతుంది. లవంగ మొగ్గను నోటిలో వేసుకుని చప్పరించడం వలన కూడా చక్కటి ఉపయోగాలుంటాయి. గొంతులో గర గర బాగా ఉన్నట్లయితే చిటికెడు పచ్చి పసుపును వేడి పాలలో వేసుకుని తాగినట్లయితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. అయితే, ఈ చిట్కాలు సాధారణ లక్షణాలున్న వారికి చక్కగా ఉపయోగపడతాయి. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని పెద్దలు సూచిస్తున్నారు.