Karonda Fruit Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకి కొన్ని రకాల పండ్ల గురించి మాత్రమే తెలుసు. వాటినే డైలీ ఎక్కువగా తింటారు. అయితే మనకి తెలియని చాలా రకాల పండ్లు మార్కెట్లో ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను డైలీ లైఫ్‌లో మనం అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. వీటివల్ల చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మనకి మార్కెట్లో కొన్ని పండ్లు అన్ని రోజులు దొరకవు. సీజన్ల బట్టి మాత్రమే దొరుకుతాయి. అందులో కరోండా పండ్లు ఒకటి. అరుదుగా దొరికే ఈ పండ్లు తినడానికి ఘాటుగా, పులుపుగా, చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ పండ్లు వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి పైరేటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, కూలింగ్, యాంటెల్మింటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ అల్సర్, యాంటీ స్కోర్బుటిక్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యలు బారి నుంచి కాపాడటంతో పాటు ఈజీగా బరువు తగ్గేలా చేస్తాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించి నాజుకైనా నడుమును మీ సొంతం చేస్తుంది.
కరోండా పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిపిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. వీటితో పాటు గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడంతో పాటు బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని కాల్షియం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయని నిపుణులు అంటున్నారు. కరోండాలోని విటమిన్ సి, విటమిన్ ఎ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టు రాలిపోయే సమస్యలు అన్నింటిని క్లియర్ చేస్తాయి. అలాగే మానసిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్లు, ట్రిప్టోఫాన్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోజూ ఒక కరోండా పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్త పోటు అదుపులో ఉంటుంది. ఈ పండు తినడం నచ్చకపోతే జ్యూస్ అయిన చేసి తాగవచ్చు. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే బ్లడ్ కూడా శరీరానికి బాగా ఎక్కుతుంది. అయితే కొందరు రక్త హీనత సమస్యతో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్లు రోజుకి ఒక్కసారి అయిన ఈ కరోండా పండు తింటే సమస్య మొత్తం క్లియర్ అవుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.