Kallu vs Alcohol: తెలంగాణలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన కొందరి ఇళ్లల్లో.. కల్లు తప్పనిసరిగా ఉంటుంది. అయితే కల్లు అనగానే ఇది ఒక ఆల్కహాల్ అనే ముద్రపడింది. వాస్తవానికి దీనిని తీసుకోవడం వల్ల మత్తు వస్తుంది. కానీ సాధారణ మద్యం కంటే కల్లు ఎంతో ఆరోగ్యకరమని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తాటి చెట్టు లేదా ఈత చెట్టు నుంచి వచ్చిన పరిశుభ్రమైన కల్లు మాత్రమే ఆరోగ్యకరమని, అలాకాకుండా అందులో ఇతర పదార్థాలు కలిపితే అది హానికరంగా మారుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అసలు కల్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? ఇందులో ఎటువంటి విటమిన్స్ లభిస్తాయి?
Also Read: తేనె ఎందుకు పాడవదు? దీనికి ఎండ్ డేట్ ఎందుకు ఉండదు?
ప్రకృతి ఒడిలో సహజంగా లభించే ఈ ద్రవ పదార్థం శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కల్లు లో విటమిన్ ఏబిసిడి తోపాటు అనేక రకాల ఖనిజాలు లభిస్తాయి. దీనిని తాగడం వల్ల శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది. అలాగే జీర్ణక్రియ సమస్యతో బాధపడే వారికి ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కంటి చూపు సమస్య ఉన్నవారు ఈ పదార్థాన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి కల్లు చాలావరకు ఉపయోగపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా అనేక రోగాలకు దూరంగా ఉండగలుగుతారు. అందుకే వారానికి ఒకసారి లేదా కొన్ని రోజులకు ఒకసారి కల్లు తీసుకోవడం సమస్య కాదని అంటున్నారు.
అయితే చెట్టు మీద నుంచి దించిన కొద్దిసేపటికి మాత్రమే తాగడం వల్ల ఇందులో అనేక రకాల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. అలా కాకుండా చాలా సేపు వెయిట్ చేసినా.. లేదా ఎక్కువ సేపు నిల్వ ఉంచిన కల్లు తాగడం వల్ల ఆల్కహాల్ గా మారుతుందని చెబుతున్నారు. ఇలా ఎక్కువసేపు నిల్వ ఉంచిన కల్లు తాగడం వల్ల ఎక్కువగా మత్తు వస్తుందని తెలుపుతున్నారు. దీంతో ఈ ప్రభావం కాలేయంపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువసేపు నిల్వ ఉంచిన కల్లు ను ఎక్కువగా తాగడం వల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యానికి గుర అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: బిర్యానీని తినడం మానకండి.. ఎందుకంటే?
అందువల్ల సాధ్యమైనంతవరకు చెట్టు మీది నుంచి దించిన తర్వాతే తీసుకోవడం ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా కల్లు తాగే సమయంలో సాధారణ ఆహారం మాత్రమే తీసుకోవాలి. హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల కల్లు తాగిన ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఫుడ్ లో కల్తీ ఉంటే పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది. కల్లు తాగేటప్పుడు తక్కువ ఆహారం తీసుకోవడం ఉత్తమం. దీనిని తీసుకున్న గంట తర్వాత మిగతా ఆహారాన్ని లేదా భోజనం చేయాలి. అలా చేయని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
కల్లు ను ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.