Jaundice Symptoms: ప్రస్తుతం చాలా మందికి కామెర్లు వస్తుంటాయి. ఈ సమస్య వస్తే చాలు శరీరంలో చాలా మార్పు వస్తుంది. ముఖ్యంగా కళ్లు, గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. దీని ప్రభావం కళ్ళ నుంచి గోళ్ళ వరకు కనిపిస్తుంది. మీరు ఈ లక్షణాలను, ఈ వ్యాధిని లైట్ తీసుకుంటే కొన్నిసార్లు శరీరంలో ప్రమాదకరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కామెర్లు వచ్చిన తర్వాత కళ్ళు, గోళ్ళు పసుపు రంగులోకి మారుతాయి అనే విషయం తెలిసిందే. మరి దీనికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు దీనికి కారణాలు తెలుసుకుందాం. పదండీ.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బిలిరుబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపిస్తుంది. శరీరంలో అప్పుడప్పుడు ఎర్ర రక్త కణాలు ఏర్పడి చనిపోతాయి. కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. కాలేయం చనిపోయిన కణాలను ఫిల్టర్ చేయకపోతే కచ్చితంగా సమస్య వస్తుంది. దీని పరిణామంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలలో పసుపు రంగు వస్తుంది. దీనిని కామెర్లు అంటారు. ఈ వ్యాధిని రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు.
ఈ లక్షణాలు కనిపిస్తాయి
కళ్ళు, గోర్లు, మూత్రం పసుపు రంగులోకి మారుతాయి. చర్మం పసుపు రంగులో కనిపిస్తుంది. ఆకలి ఉండదు. వికారం, ఏమీ తినాలని అనిపించదు. కడుపు నొప్పి, అలసిపోయినట్లు అనిపిస్తుంది, బరువు తగ్గడం, ప్రారంభ దశలో వైరల్ జ్వరం, చలిగా అనిపిస్తుంది, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కలుషితమైన ఆహారం తీసుకోవద్దు, మద్యం సేవించవద్దు, మరిగించిన నీరు తాగాలి, నూనె పదార్ధాలను తగ్గించండి, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి, భోజనం చేసేటప్పుడు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
Also Read: Heart Disease : ఆఫీస్ ఉద్యోగులలో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
పారాసెటమాల్ వంటి కొన్ని మందుల అధిక మోతాదు తీసుకుంటే ఈ సమస్య వస్తుందట. అంతేకాదు విషపూరిత పుట్టగొడుగుల వంటి విష పదార్థాలు ఉపయోగిస్తే కూడా ఇది జరగవచ్చు. ఈ పరిస్థితి గిల్బర్ట్ సిండ్రోమ్, డుబిన్-జాన్సన్ సిండ్రోమ్ మొదలైన రుగ్మతల వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. పిత్త వాహిక లేదా పిత్తాశయ రాళ్ళు అడ్డుకుంటే కూడా కామెర్లు వస్తాయి. అయితే ఈ కామెర్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. దీన్ని అర్థం చేసుకునే ముందు, ఈ వ్యాధికి కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. అయితే కాలేయం సరిగ్గా పనిచేయకపోతే బిలిరుబిన్ శరీరం నుంచి బయటకు రావడం కష్టం. రాదు కాబట్టి శరీరంలో దాని స్థాయి పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, కామెర్లతో పాటు ముదురు మూత్రం, తేలికపాటి మలం, అలసట, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, అది కాలేయం దెబ్బతిన్నట్లు సంకేతం కావచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.