Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మందు సీసాలపై ముద్రించి అమ్ముతున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు మద్యం ఆరోగ్యానికి మంచిది కాదంటూనే ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అల్కహాల్ తాగడం వల్ల అవయవాలు పాడైపోతున్నాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు.
అల్కహాల్ తాగే ముందు..
అల్కాహాల్ తాగే ముందు చాలా మంది ఏమి తినరు. అలాగే తాగుతుంటారు. కానీ అది మంచిది కాదు. మద్యం తాగే ముందు ఏదైనా తింటే దాని ప్రభావం అంతగా ఉండదు. మందుకు బానిసలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల అల్కహాల్ ప్రభావాన్ని దూరం చేస్తుంది.
ఉప్పుగా ఉండే వాటిని..
మద్యం తాగే సమయంలో ఉప్పుగా ఉండే వాటిని దూరంగా ఉంచడమే మంచిది. వాటిని తినడం వల్ల మద్యం ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది. దీని వల్ల శరీరం డీ హైడ్రేడ్ కు గురవుతుంది. దీంతో పానీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. కానీ ఎవరు వింటారు. ఉప్పుగా ఉండే వాటిని తినడం వల్ల మద్యం ఎక్కువగా ఉంటుంది. అల్కహాల్ తీసుకోకపోవడమే బెటర్ అని గుర్తించడం లేదు.
మంచి ఆహారం
మందు తాగడానికి ముందు మంచి ఆహారం తీసుకుంటే నష్టం ఉండదు. పండ్లు, కూరగాయలు, దోసకాయ, టమాట, బెల్ పెప్పర్, ముల్లంగి వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అరటి పండు తింటే ఇందులో ఉండే ఫైబర్ వల్ల మందు ప్రభావం పడకుండా చేస్తుంది. ఏం తినకుండా తాగితే అల్కహాల్ మొత్తం శరీరంలోని రక్తంలో కలిసిపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.
15 నిమిషాల ముందే..
అల్కహాల్ తీసుకోవాల్సి వస్తే దాని కంటే 15 నిమిషాల ముందే ఏదైనా ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల హ్యాంగోవర్ సమస్య రాకుండా చేయడానికి సాయపడుతుంది. ఈ విషయాన్ని నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ లో జరిగిన యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యరోఫార్మకాలజీ వారు నిర్వహించిన పరిశోధనలో వెల్లడించారు.