Fruits : ఆరోగ్యం కోసం మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మారుతున్న పరిస్థితుల కారణంగా మనం ఆహారం తీసుకునే సమయంలో కచ్చితంగా నియమాలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. పండ్లు తినడం వల్ల చర్మం, జుట్టు, జీవక్రియ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొంతమంది ఉదయం అల్పాహారంలో పండ్లు తీసుకోవడం మంచిదేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. పండ్లలో ఎంజైములు, ఆమ్లాలు ఉండటంతో వీటిని తినడం మంచిది.
పండ్లు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని తెలిసినా దీర్ఘకాల వ్యాధులున్న వారికి అవి ఎలాంటి దుష్ప్ర భావాలు కలిగిస్తాయో తెలుసుకుని తినాలి. పండ్లలో ఎంజైమ్ లు, సిట్రిక్ యాసిడ్, టార్టారిక్, ఫ్యూమారిక్, ఆక్సాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం వంటి ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పాల ఉత్పత్తులలోని లాక్టిక్ ఆమ్లంతో త్వరగా స్పందిస్తాయి. ఇవి కూరగాయలు, ధాన్యాలు, మాంసంతో కలవవు. ఇవి జీర్ణం కాని జీవక్రియ వ్యర్థాలను పుట్టిస్తాయి. ఇలాంటి కలయికలు కణజాలం జీవక్రియకు ఆటంకం కలిగిస్తాయి.
జలుబు, దగ్గు, సైనటైటిస్, అలర్జీలు, ఆస్తమా, జ్వరం, ఊపిరితిత్తుల రద్దీ బ్రాంకైటిస్, డయాబెటిస్, బరువు పెరగం, ఎసిడిటి వంటి లక్షణాలు ఉన్న వారు ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు. మలబద్ధకం, పొడిచర్మం, పొడి జుట్టు, బలహీనమైన జీవక్రియ, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలు ఉంటే ఉదయం పూట పండ్లు తినడం మంచిదే. ఇవి జీర్ణరసాలను ప్రేరేపిస్తాయి. మలబద్ధకం పోగొట్టడానికి పండ్లు తీసుకోవడం ప్రయోజనకరమే. ఉదయం పండ్లు తీసుకుంటే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
పండ్లను ఇతర వాటితో కలిపి తినకూడదు. పొడి ధాన్యాలు లేదా మాంసంతో కలపకూడదు. ఇలా చేస్తే విషంగా మారుతుంది. డ్రై ఫ్రూట్స్ ను పండ్లతో కలిపి తింటే ఏ ఇబ్బందులు ఉండవు. ఉదయం పండ్లు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం డీటాక్సిఫికేషన్ సరిగా జరుగుతుంది. పండ్లు తినడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. శరీరం చురుకుగా మారుతుంది. నిద్రలేమి దూరం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.