ఛాతీలో భరించలేని నొప్పా.. కరోనా అంటున్న వైద్యులు..?

మనలో చాలామంది కొన్నిసార్లు ఛాతీలో నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఛాతీలో నొప్పి రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి ఛాతీలో నొప్పితో పాటు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే మాత్రం తేలికగా తీసుకోకూడదు. గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రమే ఆ విధంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేసినా లేదా అజీర్తి వల్ల కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి వస్తుంది. Also Read: వ్యాక్సిన్ వచ్చినా కరోనా వైరస్ అదుపులోకి రాదా..? ఛాతీలో నొప్పిగా […]

Written By: Navya, Updated On : December 4, 2020 1:05 pm
Follow us on


మనలో చాలామంది కొన్నిసార్లు ఛాతీలో నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఛాతీలో నొప్పి రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి ఛాతీలో నొప్పితో పాటు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే మాత్రం తేలికగా తీసుకోకూడదు. గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రమే ఆ విధంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేసినా లేదా అజీర్తి వల్ల కొన్ని సందర్భాల్లో ఛాతీలో నొప్పి వస్తుంది.

Also Read: వ్యాక్సిన్ వచ్చినా కరోనా వైరస్ అదుపులోకి రాదా..?

ఛాతీలో నొప్పిగా ఉంటే కరోనా కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా కరోనా రోగుల్లో దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతూ ఉండటంతో కొందరు శాస్త్రవేత్తలు ఛాతీ నొప్పి కూడా కరోనా లక్షణమేనని చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యల వల్ల ఛాతీలో భరించలేని నొప్పి రావచ్చని తెలుపుతున్నారు.

Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి చాలా డేంజర్..?

ఛాతీలో తరచుగా నొప్పి ఉంటే మాత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కొందరు కరోనా రోగులు తరచూ దగ్గుతూ ఉండటం వల్ల కూడా ఛాతీలో నొప్పి రావచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఛాతీలో నొప్పి కరోనా లక్షణమేనని చెబుతోంది. ఛాతీలో ఒత్తిడి, శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

అసాధారణ స్థితిలో ఛాతీలో నొప్పి వస్తే మాత్రం వైద్యులు గుండె జబ్బు కావచ్చని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నా లేకపోయినా ఛాతీలో నొప్పి ఉంటే వీలైనంత త్వరగా చెక్ చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.