https://oktelugu.com/

Covid Vaccine : కోవిడ్ టీకా మంచిది కాదా? గుండె పోటు మరణాలు దేనికి సంకేతం?

Covid Vaccine : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ నివారణకు వేసిన టీకా మంచిది కాదా? అది మనుషుల ప్రాణాలను తీస్తోందా? టీకా వేసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తాయా? టీకా వేసుకున్న తర్వాత మరణాలు సంభవించాయా? ఇలాంటి మరణాలు ఎన్ని సంభవించాయి? ఇప్పటిదాకా దీనిపై ఎటువంటి సమాచారం లేదు. తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాలు ఇప్పుడు దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కోవిడ్ మాత్రమే కాదు వేసుకున్న టీకా కూడా ప్రాణాలను తీస్తోందని తెలుస్తోంది.. దేశవ్యాప్తంగా […]

Written By:
  • Rocky
  • , Updated On : March 28, 2023 3:27 pm
    Follow us on

    Covid Vaccine : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ నివారణకు వేసిన టీకా మంచిది కాదా? అది మనుషుల ప్రాణాలను తీస్తోందా? టీకా వేసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తాయా? టీకా వేసుకున్న తర్వాత మరణాలు సంభవించాయా? ఇలాంటి మరణాలు ఎన్ని సంభవించాయి? ఇప్పటిదాకా దీనిపై ఎటువంటి సమాచారం లేదు. తాజాగా కేంద్రం వెల్లడించిన వివరాలు ఇప్పుడు దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కోవిడ్ మాత్రమే కాదు వేసుకున్న టీకా కూడా ప్రాణాలను తీస్తోందని తెలుస్తోంది.. దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా వేయించుకున్న తర్వాత 1156 మంది చనిపోయారు.

    వాస్తవానికి 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు సంభవించిన మరణాలు, పీక తర్వాత దుష్ప్రభావాల పై ఇప్పుడు కేంద్రం వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. దేశ వ్యాప్తంగా టీకా వేసుకున్న తర్వాత దుష్పరిణామాలకు సంబంధించి 92,479 ఏఈఎఫ్ఐ కేసులు నమోదయ్యాయి. ఇందులో మైనర్, సివియర్, సీరియస్ ఘటనలు చోటుచేసుకున్నాయి.

    టీకా వేసుకున్న తర్వాత సంభవించిన మరణాలలో దేశంలోనే అత్యధికంగా కేరళలో సంభవించాయి. ఈ రాష్ట్రంలో ఏకంగా 244 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. 102 మంది ఇక్కడ చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో 86, మధ్య ప్రదేశ్ లో 85, కర్ణాటకలో 75, బెంగాల్లో 70, బీహార్లో 62, ఒడిశాలో 50, తమిళనాడులో 44, తెలంగాణలో 37, ఆంధ్ర ప్రదేశ్ లో 37 మంది చనిపోయారు. ఎనిమిది రాష్ట్రాల్లోనే 10 లోపు మరణాలు సంభవించాయి. మిగతా రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువగానే మరణాలు నమోదు అయ్యాయి.

    టీకా తీసుకున్న తర్వాత కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. టీకా ప్రతికూల సంఘటనలు భారీగాన నమోదు అయ్యాయి. ఏఈఎఫ్ఐ ఘటనల విషయంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 10,513 ఘటనలు నమోదయ్యాయి. ఆ తర్వాత 10,370 ఘటనలతో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. గుజరాత్ 10,127 ఘటనలతో మూడో స్థానంలో ఉంది.

    కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కొందరు వెంటనే, మరికొందరు రోజుల అభివృద్ధిలో మరణించారు. అప్పట్లో ఇది వ్యాక్సిన్ వల్ల కాదని ప్రభుత్వాలు వివరణ ఇచ్చాయి.. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వాలు అలా చెప్పాయి. కోవిడ్ వ్యాప్తి తీవ్రతతో సంభవించే మరణాల కన్నా..టీకా మరణాలు చాలా స్వల్పమని వైద్య ఇతనులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీకా వల్ల ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు స్వల్పం కావడంతో.. అందరూ టీకా తీసుకోవాలని వైద్యులు అప్పట్లో సూచించారు. అయితే ఇప్పటికి కోవిడ్ టీకా మీద అనేక అపోహలు ఉన్నాయి. అయితే టీకాతో ఒకప్పుడు రక్షణ లభించినప్పటికీ.. దీర్ఘకాలంలో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పినా వైద్యులు కూడా ఉన్నారు.. అయితే ప్రస్తుతం అనేకమంది గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్నారు. అది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే అని ప్రచారం విస్తృతంగా ఉంది. శాస్త్రీయంగా ఎటువంటి నిరూపణ కాకపోయినప్పటికీ ప్రచారం మాత్రం బలంగా జరుగుతోంది.