Romance : ఉదయం పూట రొమాన్స్ మంచిదేనా?

Romance : మనదేశంలో రొమాన్స్ గురించి బహిరంగా చర్చించడం నేరమనే భావన ఇప్పటికి ఉంది. దీంతో అందులో ఉన్న మర్మాలను తెలుసుకోలేకపోతున్నాం. రొమాన్స్ పై ఎన్నో ఆశలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో మనం ఎన్నో మార్గాలు అన్వేషిస్తుంటాం. కానీ నలుగురిలో మాత్రం దీని గురించి చర్చించడం కుదరదు. ఈ నేపథ్యంలో రతికి సంబంధించిన అంశాల్లో మనకు ఎన్నో అనుమానాలు నిత్యం వేధిస్తుంటాయి. కానీ వీటికి మనం సమాధానాలు తెలుసుకుంటే మనం ఎంతో ముందుకు వెళ్లొచ్చు. […]

Written By: Srinivas, Updated On : April 17, 2023 9:38 am
Follow us on

Romance : మనదేశంలో రొమాన్స్ గురించి బహిరంగా చర్చించడం నేరమనే భావన ఇప్పటికి ఉంది. దీంతో అందులో ఉన్న మర్మాలను తెలుసుకోలేకపోతున్నాం. రొమాన్స్ పై ఎన్నో ఆశలు, కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో మనం ఎన్నో మార్గాలు అన్వేషిస్తుంటాం. కానీ నలుగురిలో మాత్రం దీని గురించి చర్చించడం కుదరదు. ఈ నేపథ్యంలో రతికి సంబంధించిన అంశాల్లో మనకు ఎన్నో అనుమానాలు నిత్యం వేధిస్తుంటాయి. కానీ వీటికి మనం సమాధానాలు తెలుసుకుంటే మనం ఎంతో ముందుకు వెళ్లొచ్చు.

ఉదయం రొమాన్స్ మంచిదేనా?

చాలా మంది మన దేశంలో రొమాన్స్ రాత్రి పూటే చేసుకోవాలని అనుకుంటారు. కానీ దాన్ని ఉదయం పూట చేస్తే ఇంకా ఉత్సాహం పెరుగుతుందనే విషయం తెలియదు. దీంతో ఏదో మొక్కుబడిగా రాత్రి కానిచ్చేసి ఉదయం రిలాక్స్ గా ఉంటారు. ఇది కరెక్టు కాదు. రాత్రి కంటే ఉదయమే మంచి ఉత్సాహం ఉరకలేస్తుంది. శరీరం బాగా సహకరిస్తుంది.

ఏ లాభాలుంటాయి?

ఉదయం సమయంలో రొమాన్స్ చేస్తే మంచి లాభాలుంటాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్, మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్లు విడుదల అవుతాయి. దీనికి తోడు ఆ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ తో మనకు సంతోషం రెట్టింపు అవుతుంది. దీని వల్ల ఉదయం మనం రొమాన్స్ చేయడం వల్ల మనకు చాలా లాభాలున్న సంగతి తెలుసుకుని ప్రవర్తిస్తే మనకు స్వర్గమే.

ఒత్తిడి దూరం

ఉదయం పూట రొమాన్స్ తో ఒత్తిడి దూరమవుతుంది. శరీరం ఉత్తేజితంగా మారుతుంది. రోజంతా ఉత్సాహం ఉరకలేస్తుంది. దీని వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉదయం పూట రొమాన్స్ చేసుకోవడం వల్ల ఇద్దరికి కూడా మంచి అనుభవాలు దక్కుతాయి. ఇలా పాత కాలం నాటినుంచి వస్తున్న ఆచారాల్లో రాత్రి పూట రొమాన్స్ ను ఉదయం పూటకు బదిలీ చేసుకుంటే ఇంకా ఎంతో ఆనందం మన సొంతమవుతుంది.