https://oktelugu.com/

షుగర్ పేషెంట్లు తేనె తింటే ఏమవుతుందో తెలుసా..?

దేశంలో మధుమేహంతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, జన్యుపరమైన కారణాల వల్ల మధేమహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకసారి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే డయాబెటిస్ రోగులు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు తినొచ్చో తినకూడదో అర్థం కాక డయాబెటిస్ రోగులు ఇబ్బంది పడుతూ ఉంటారు. గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 18, 2020 / 01:56 PM IST
    Follow us on


    దేశంలో మధుమేహంతో బాధ పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, జన్యుపరమైన కారణాల వల్ల మధేమహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకసారి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే డయాబెటిస్ రోగులు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు తినొచ్చో తినకూడదో అర్థం కాక డయాబెటిస్ రోగులు ఇబ్బంది పడుతూ ఉంటారు.

    గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం శాస్త్రవేత్తలను సైతం టెన్షన్ పెడుతోంది. డయాబెటిస్ వల్ల శరీరంలోని అయవయాలు ఫెయిల్ కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంటుంది. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మాత్రమే డయాబెటిస్ రోగులకు మంచిది. అయితే షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులు తేనె తీసుకోవచ్చా..? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.

    చక్కెర తీసుకున్నా, తేనె తీసుకున్నా ఈ రెండు శరీరంలోని షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపుతాయి. పంచదారతో పోలిస్తే తేనె వినియోగించడం వల్ల మెరుగైన ఫలితాలే కలిగినా రోగులు తేనె తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ డయాబెటిస్ రోగులు ఎవరైతే తేనె తీసుకుంటారో వాళ్ల ఆరోగ్యంపై తీవ్రంగా తేనె ప్రభావం ఉంటుందని.. తేనెను ఏ విధంగా తీసుకున్నా డయాబెటిస్ రోగులకు నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పారు.

    డయాబెటిస్ రోగులు తినే ఆహారం విషయంలో తప్పనిసరిగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని లేకపోతే నష్టపోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా తేనెపై మరీ ఇష్టం ఉంటే లెమన్ జ్యూస్ తో కలిపి తీసుకోవాలని అంతే తప్ప డైరెక్ట్ గా తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.