Dog Facts: కుక్కలను గ్రామ సింహాలని పిలుస్తూ ఉంటారు. చాలా మంది కుక్కలను తమ ఇంట్లో పెంచుకుంటారు.. పెంపుడు కుక్కల పట్ల కొంత మంది చూపించే ప్రేమకు ఎల్లలు ఉండవు. వారు తమ సొంత వాళ్ళలాగా పెంపుడు కుక్కలని చూసుకుంటారు. వాళ్ళ పిల్లలతో సమానంగా పెంపుడు కుక్కలపై ప్రేమ చూపించే వారు కూడా ఉన్నారు.
కుక్కలు కూడా అలానే యజమానులపై ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. అవి విశ్వాసానికి ప్రతీకగా ఉంటాయి.. ఈ కుక్కలను కాల యముడి వాహనంగా కూడా అంటారు పెద్దవారు.. కుక్కలకు ఏం జరుగుతుందో ముందే తెలిసి పోతుంది అని నానుడి. వీటిని కొన్ని సమయాల్లో శుభంగా భావిస్తే మరి కొన్ని సమయాల్లో మాత్రం అశుభంగా భావిస్తాం.
Also Read: Chiranjeevi Fans: కొరటాల శివ వల్ల ఆచార్య కి పెద్ద సమస్య.. ఆవేశం తో రగిలిపోతున్న ఫాన్స్
మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది.. కుక్క నోరు తెరచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలా మందికి భయం వేస్తుంది. ఆ సమయంలో కుక్క అరుపు అంత భయంకరంగా ఉంటుంది. కుక్క ఎవరింటి ముందు ఏడిస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు మరణిస్తారు అని మన పెద్ద వారు చెబుతూ ఉంటారు.. అలాగే వీటికి భూకంపం వచ్చే ముందు కూడా తెలుస్తుందట..
కుక్క ఏడుస్తుంటే అలా వదిలేస్తాం కానీ కుక్క కాల యముడి వాహనం అయినందువల్ల ఎవరైనా తాంత్రిక శక్తులతో ఇబ్బంది పడుతుంటే కుక్కని ఆదరిస్తే పోతాయట.. కుక్కను చూసినప్పుడు కొట్టకుండా వాటిని ఆదరించి సేవ చేయడం, ఆహారం పెట్టడం వంటివి మీకు చేతనైనంత వరకు చేయాలి.. ఎందుకంటే కుక్కను కొడితే మనకి కీడు జరుగుతుందట. వాటికీ మనకు తోచినంత సహాయం చేయాలి.. దోషాలు పోవడానికి పూజలు కూడా చేస్తారు.. పిల్లలు సరిగా చదవక పోయిన, ఉద్యోగ పరమైన ఇబ్బందులు ఉన్నా కుక్కకి సేవ చేయడం మంచిది.. ఇంకా సంతానం లేని వారు కుక్కకి అన్నం పెట్టడం, సేవ చేయడం, వాటిని చేరదీయడం వంటివి చేయాలి.
అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చినా, అరిచినా, లేదా కుక్క కాలు నాకినా మీ పనికి ఏదొక ఆటంకం వస్తూందని అర్ధం. అది ప్రాణ నష్టానికి కూడా దారి తీస్తుంది. కుక్క ఎప్పుడైనా ఎవరి వాహనం మీద అయినా మూత్ర విసర్జనం చేస్తే వారికీ కలిసి వస్తుందట.
Also Read: Chiranjeevi Acharya: నైట్ చిరంజీవి ఇచ్చిన పార్టీలో డైరెక్టర్లు రచ్చ రచ్చ !