Devotional Tips: మనలో చాలామంది ఎంతో ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో, పట్టణాలలో ఆంజనేయ స్వామి గుళ్లు ఉన్నాయి. ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు.
అందువల్ల స్వామివారి పాదాలను తాకడం మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన సమయంలో చాలామంది 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే 27, 54 ప్రదక్షిణలు చేసినా కూడా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆంజనేయ స్వామి గుడిలో “శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయజయ హనుమాన్” అనే మంత్రాన్ని జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
ఆంజనేయ స్వామిని భక్తులు వేర్వేరు పేర్లతో పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఆంజనేయ స్వామి గుడిలో మూడు ప్రదక్షిణలు చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.