Corona Virus: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన వాళ్లలో చాలామందికి వారం రోజుల్లోనే నెగిటివ్ వస్తోంది. మరి కొందరికి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చినా వైరస్ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. దీర్ఘకాలం కరోనా సమస్యలు వేధిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కొన్ని కారణాల వల్ల కొంతమందిని కరోనా దీర్ఘకాలం వేధిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నాలుగు ముప్పు కారకాల వల్ల కొంతమంది దీర్ఘకాలం పాటు కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆటో యాంటీబాడీల సమస్య వల్ల కొంతమందిని దీర్ఘకాల కోవిడ్ వేధిస్తోంది. యాంటీ ఐ.ఎఫ్.ఎన్ అల్ఫా2 అనే ఆటో యాంటీబాడీలు దీర్ఘకాల కరోనాకు దారి తీస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఎప్ స్టీన్ బార్ వైరస్ కూడా దీర్ఘకాల కోవిడ్ కు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: దైవభక్తి మెండు.. ప్రస్తుతానికి ఇదే ట్రెండ్.. జగన్ వెళ్లేది అందుకేనా?
ఈ వైరస్ వల్ల నిస్సత్తువ, ఊపిరితిత్తుల్లో కళ్లె, మతిమరుపు , ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మధుమేహం బాధితులను దీర్ఘకాల కోవిడ్ సమస్య వేధిస్తోంది. కరోనా నిర్ధారణ అయిన సమయంలో ఆర్.ఎన్.ఏ ఎక్కువ మొత్తం ఉండటం కూడా కరోనా లక్షణాలు ఎక్కువ రోజులు ఉండటానికి ఒక విధంగా కారణమవుతోంది. కార్టిజోల్ మోతాదు తక్కువగా ఉన్నా దీర్ఘకాలం కరోనా లక్షణాలు కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి.
కార్టిజోల్ ను భర్తీ చేయడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: సింగరేణి విషయంలో మరోమారు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధమే?