https://oktelugu.com/

Ileana: నడుము కింది భాగంలో నొప్పి ఉందా.. ఐతే – ఇలియానా

Ileana: గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాకి మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. పైగా మహిళల సమస్యల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటుంది ఈ గోవా ముదురు బ్యూటీ. అయితే, ఇలియానా తాజాగా పీరియడ్స్ గురించి తనదైన శైలిలో సొల్లు చెప్పుకొచ్చింది. ‘పీరియడ్స్ రెండో రోజు అధిక రక్తస్రావం ఉంటుంది, అలాగే నడుము కిందిభాగంలో నొప్పి వల్ల ఎంత కష్టంగా ఉంటుంది.. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 15, 2022 / 04:16 PM IST
    Follow us on

    Ileana: గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాకి మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. నిత్యం ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. పైగా మహిళల సమస్యల పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఉంటుంది ఈ గోవా ముదురు బ్యూటీ. అయితే, ఇలియానా తాజాగా పీరియడ్స్ గురించి తనదైన శైలిలో సొల్లు చెప్పుకొచ్చింది. ‘పీరియడ్స్ రెండో రోజు అధిక రక్తస్రావం ఉంటుంది, అలాగే నడుము కిందిభాగంలో నొప్పి వల్ల ఎంత కష్టంగా ఉంటుంది.. ఇది చాలామందికి తెలుసు.

    Ileana

    Also Read: ఇవి తింటే చాలు.. ఇక జీవితంలో లివర్ సమస్య రాదు !

    అయితే, ఆ సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది, కానీ, అది అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వదు అని గ్రహించండి. అందుకే, ఆ సమయంలో మీరు మీ శరీరం చెప్పిందే వినండి. అదే మంచిది. ఇక అవసరం అనుకుంటే సెలవు తీసుకోవడం ఉతమైన పని. ‘పీరియడ్స్ విషయంలో ఏ అమ్మాయి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందరూ తమ హక్కును కాపాడుకోండి’ అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

    ఇక ఒకపక్క ఇలియానా సైడ్ బిజినెస్ చేస్తూనే.. సినిమాల్లో నటించడానికి అవకాశాల కోసం తిరుగుతుంది. మధ్యమధ్యలో పెళ్లి అంటూ వస్తున్న పుకార్ల పై క్లారిటీ ఇస్తూ.. పై విధంగా మహిళల సమస్యల పై ఎప్పటికప్పుడు తనకు నచ్చిన విధంగా చెప్పుకుంటూ ముందుకు పోతుంది. అన్నట్టు తాజాగా పెళ్లి విషయం పై ఓ నెటిజన్ ఇలియానాకి మెసేజ్ పెడితే.. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు పెళ్లి ఆలోచన ఉంది. అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

    Also Read: మీ జుట్టు అన్ని సమస్యలు తీరిపోవాలా ? ఇలా చేయండి !

    Tags