Dhanush and Mrunal Thakur: పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు ధనుష్(Dhanush K Raja). ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఈయనకు భారీ కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. ఈమధ్య కాలం లో ఆయన హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఒక నటుడిగా ఆయన సాధించిన విజయాలు, అందుకున్న అవార్డులు, రివార్డులు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ని పెళ్లాడడం, పాతికేళ్ళు ఆమెతో దాంపత్య జీవితం గడిపిన తర్వాత రీసెంట్ గానే విడాకులు తీసుకోవడం వంటివి మనం చూసాము. ఈ దంపతులిద్దరికీ ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. గత కొంతకాలం గా సింగిల్ గా ఉంటున్న ధనుష్, ఈమధ్య కాలం లో ప్రముఖ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తో ప్రేమలో పడినట్టు, ఆమెతో డేటింగ్ కూడా చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు అనేక సందర్భాల్లో కలిసి తిరగడం, మృణాల్ ఠాకూర్ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిధి గా ధనుష్ రావడం వంటివి చూసిన తర్వాత వీళ్ళ రిలేషన్ పై మరింత జోరుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో ‘ధో దివానే సహార్ మెయిన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది హీరో గా నటించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ వీడియో ని మృణాల్ ఠాకూర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ చూడగానే ధనుష్ ‘చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది ఈ గ్లింప్స్ వీడియో’ అని కామెంట్ చేస్తాడు.
దీనికి మృణాల్ ఠాకూర్ ఎమోజి తో రిప్లై ఇస్తుంది. ఈ సినిమాకు ధనుష్ కి ఎలాంటి సంబంధం లేదు, అయినప్పటికీ ఆయన కామెంట్ చేసాడంటే కచ్చితంగా ఎదో విషయం ఉన్నట్టే కదా?, ఎందుకంటే ధనుష్ రజినీకాంత్ సినిమాలకు సంబంధించిన టీజర్, లేదా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా కామెంట్స్ చేస్తుంటాడు. వేరే ఏ హీరో విషయం లో కానీ, హీరోయిన్ విషయం లో కానీ అయన రియాక్ట్ అయినట్టు ఎక్కడా ట్రాక్ రికార్డు లేదు. అలాంటిది ఈ సినిమా గ్లింప్స్ వీడియో మీద కామెంట్ చేసాడంటే కచ్చితంగా వీళ్ళ మధ్య మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరుగులు తీస్తుంది అనే చెప్పొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ జంట ఇచ్చే సర్ప్రైజ్ లు ఎలా ఉండబోతున్నాయి అనేది.
View this post on Instagram