Weight Loss: వాతావరణ పరిస్థితులు.. మనం తీసుకునే ఆహారం.. శారీరక శ్రమ తక్కువ కావడం వల్ల నేటి కాలంలో ప్రతీ ఒక్కరికి ఉండే ప్రధాన సమస్య బరువు పెరగడం.. దీని నుంచి బయటపడడానికి చాలా మంది ఎన్నో వ్యాయామాలు చేస్తున్నారు.. ఆహార పద్ధతులను మార్చుకుంటున్నారు. కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా కొంత మంది బరువు తగ్గరు. మరికొందరు ప్రత్యేకంగా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు.. ఇవి తాత్కాలికంగానే ఉపశమనం పొందుతాయి గానీ.. శాశ్వతంగా సమస్య పరిష్కారం కాదు. ఈ నేపథ్యంలో బరువు తగ్గించడానికి అద్భుత సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి శ్రమ లేకుండా.. మనకు తెలియకుండానే బరువు తగ్గే టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.
ప్రతీ రంగంలో టెక్నాలజీ పాగా వేస్తోంది. వ్యవసాయ రంగంలో సైతం సాంకేతికతను ఉపయోగించి సులువైన పద్ధతుల్లో పనులు చేస్తున్నారు. బరువు తగ్గడానికి వ్యాయామానికి మించిన మార్గం లేదు. అయితే వ్యాయామం ద్వారా బరువు తగ్గాలంటే కాస్త శ్రమ పడాలి. కొందరు ఎలక్ట్రికల్ వ్యాయామ పరికరాలను ఉపయోగించి బరువు తగ్గేందుకు ప్రయత్నించారు. కానీ అవి సక్సెస్ కావడం లేదు. కానీ లేటేస్టుగా ఓ టెక్నిక్ తో ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు వీటి నిర్వాహకులు.
అమెరికన్ టెక్నాలజీతో ఓ కొత్త మిషన్ ను కనుగొన్నారు. దీని ద్వారా బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ మిషన్ పై హాయిగా నిద్రపోతే చాలు.. నిద్రలోనే బరువును తగ్గిస్తుంది. ఒక పెద్ద రూంలో కొన్ని టోనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 13 నుంచి 100 ఏళ్ల లోపు వారు వీటి ద్వారా కొవ్వును కరిగించుకోవచ్చు. వీటిని ప్రస్తుతం మన దేశంలోని సూరత్ లో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బరువు తగ్గించుకునేందుకు చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు.
సూరత్ కు చెందని కిషన్ బాయ్ అనే వ్యక్తి వీటిని స్థానికంగా ఏర్పాటు చేశారు. దీని ద్వారా బరువు తగ్గాలకునేవారు ప్రత్యేక ఆహార పద్దతులను పాటించాలన్న నియమం లేదు. వారు ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇక్కడికి వచ్చి నిద్రపోతే చాలు తమ బరువును తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బరువును తగ్గించుకోవడానికి డబ్బులతో పాటు శ్రమను ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఇక్కడికి ఒక్కసారి వస్తే సులువైన పద్ధతుల ద్వారా బరువును తగ్గించుకుంటారని అంటున్నారు.