Banana : శరీరానికి తక్షణమే బలాన్నిచ్చే వాటిలో అరటి పండు ఒకటి. దీనిని రోజు తినడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. వీటిని ఎక్కువగా జిమ్‌కి వెళ్లేవాళ్లు, ఎక్స్‌ర్‌సైజ్ చేసేవాళ్లు తింటారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. రోజుకి కనీసం ఒక్కటి తిన్న వెంటనే బలం వస్తుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈరోజుల్లో అరటి పండ్లు హైబ్రిడ్‌వి ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజుల్లో సహజంగా పండే పండ్లు దొరకడం చాలా కష్టం. రూరల్ ఏరియా లేదా గ్రామాల్లో ఈ పండ్లు దొరుకుతున్నాయి. పట్టణాల్లో అయితే అంతా హైబ్రిడ్ పండ్లే లభిస్తాయి. అయితే రోజూ అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే రోజూ వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ అవేంటో తెలుసుకుందాం.
అరటి పండులో పొటాషియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను ప్రోత్సహించడంతో పాటు శక్తిని కూడా పెంచుతాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మలబద్దకం, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అయితే అరటి పండును పరగడుపున మాత్రం తినకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. ఏ ఆహారం తినకుండా అరటి పండు తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో పొటాషియం ఉంటుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. అరటి పండులోని కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సాయపడుతుంది. అలాగే దీర్ఘకాలికంగా ఎముకల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆస్టియోపోరోసిస్, బోలు ఎముకల వ్యాధి వంటివి రాకుండా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అరటి పండ్లు తినడం వల్ల అలసట దూరం అవుతుంది. ఇందులో అధికంగా విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చడంలో సాయపడుతుంది. వీటితో పాటు మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కండరాల నొప్పిని తగ్గించి కండరాల పనితీరును మెరుగుపర్చడంలో సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉపయోగపడుతుంది. రాత్రి పూట నిద్రపోయే ముందు అరటి పండు తింటే బాగా నిద్రపడుతుంది. అయితే అరటిని రాత్రి పూట కంటే పగలు తినడం వల్ల మేలు జరుగుతుంది. బరువు పెరగాలి అనుకునే వాళ్లు వీటిని ఉదయం, రాత్రిపూట తింటే చాలా మంచిది. అలాగే అరటి తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో చిరు తిండ్లు తినాలని ఆశ ఉండదు. ఇలా బయట ఫుడ్ తినడం తగ్గించేస్తారు. అయితే మధుమేహం ఉన్న వాళ్లు వీటిని తక్కువగా తినాలి. లేకపోతే ఈ పండ్లకు దూరంగా ఉండటం మంచిది.