Fruit Juice: ఉరుకులు పరుగుల జీవితం మనల్ని రోగాలవైపు కూడా అంతే వేగంగా పయనించేలా చేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతర కార్యకలాపాలు పని ఏదైనా.. మనిషి జీవితం చాలా బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెరిగినా పూర్తిస్థాయిలో కావాల్సిన పోషకాలను అందించడంలో విఫలం అవుతున్నాం. ఇందుకు పేదరికం ఒక కారణమైతే.. బిజీ షెడ్యూల్ మరో కారణం. ఈ క్రమంలో చౌకగా మన శరీరానికి ప్రోటీన్లు అందించే ఐదు పండ్లు పండ్ల రసాలను మీ ముందుకు తెస్తున్నాం. అవి తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.
ప్రోటీన్లే కీలకం..
మన శరీరానికి ప్రోటీన్లు చాలా కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలో ప్రొటీన్ లేని భాగం లేదు. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది జీవితానికి ఒక రకమైన బిల్డింగ్ బ్లాక్. ప్రోటీన్ శరీరంలో ఎంజైమ్‌లను తయారు చేస్తుంది. ఇది అనేక రసాయన ప్రతిచర్యలకు కారణమవుతుంది. దీనితో పాటు.. ప్రోటీన్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను సంగ్రహిస్తుంది. శరీరంలోని ప్రతి భాగానికి రవాణా చేస్తుంది.
పది వేల రకాల ప్రొటీన్లు..
ఇక మన శరీరంలో కనీసం 10 వేల రకాల ప్రొటీన్లు వివిధ విధులను కలిగి ఉంటాయి. అంటే ప్రోటీన్స్ మన శరీరానికి ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. బిజీ జీవితంలో అడ్డమైన గడ్డి(జంక్ ఫుడ్స్) తింటూ ప్రొటీన్స్ అందుతున్నాయని అనుకుంటున్నారు. కానీ శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ అందడం లేదు. ఆరోగ్య కరమైన ప్రోటీన్లు 20 కంటే ఎక్కువ అమైనో ఆమ్లాల నుంచి తయారవుతాయి. 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ప్రధానంగా ఆహారం నుంచి లభిస్తాయి. మిగతావి మన శరీరానికి లభించాలంటే.. ఈ చౌకైనా ఈ ఐదు పండ్లు తిన్నా.. జ్యూస్ తాగినా సరిపోతుంది. అవి శరీరాన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీగా మారుస్తాయి.
1. జామ
జామ ప్రతిచోటా సులభంగా లభించే పండు. మార్కెట్లో చాలా చౌకగా లభిస్తుంది. ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. జామపండులో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఒక కప్పు జామపండు నుంచి 4.2 గ్రాముల వరకు ప్రొటీన్లను పొందుతారు. అంటే.. రెండు చిన్న లేదా ఒక మధ్య తరహా జామపండు నుంచి 4.2 గ్రాముల ప్రొటీన్లు పొందవచ్చు.
2. పనస పండు
జాక్‌ఫ్రూట్ ఎల్లప్పుడూ అందుబాటులో లేనప్పటికీ.. పనసలో ప్రోటీన్ చాలా ఉంటుంది. ఇది చికెన్–మటన్ కంటే శక్తివంతమైనది. ఒక కప్పు జాక్‌ఫ్రూట్ 2.8 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో ప్రొటీన్ మాత్రమే కాదు.. అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది అనేక ఇతర పోషకాల నిధి. అందుకే జాక్‌ఫ్రూట్‌ను మటన్, చికెన్‌కు ప్రత్యామ్నాయ ఫలం అంటారు.
3. అరటిపండు
అరటి పండు గురించి అందరికీ తెలుసు. తీవ్రమైన ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే.. కొన్ని రోజులు రోజూ రెండు నుంచి మూడు అరటిపండ్లను తింటే చాలా మంచిది. ప్రొటీన్ లోపం కొద్ది రోజుల్లోనే పరిష్కరించబడుతుంది. మీడియం సైజు అరటిపండులో 1.3 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. అరటిపండు.. పని చేసే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
4. గ్రేప్ ఫ్రూట్
గ్రేప్ ఫ్రూట్‌ను ప్రోటీన్ బూస్టర్ అంటారు. ఇది నారింజను పోలి ఉంటుంది కానీ ఇది నారింజ కాదు. గ్రేప్ ఫ్రూట్‌లో ప్రొటీన్ల కొరత లేదు. ఒక ద్రాక్షపండులో 1.6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అయితే, దబ్బ పండును విటమిన్ సి సూపర్ స్టార్ అంటారు. అంటే ఒక్క దబ్బపండు తింటే ప్రొటీన్లు, విటమిన్ సి కూడా లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
5. ఆప్రికాట్
ఆప్రికాట్ కూడా ప్రోటీన్ సూపర్ స్టార్. ఒక ఖుబానీ పండులో 2.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఎండిన ఆప్రికాట్‌లో కూడా ప్రోటీన్ ఉంటుంది. సలాడ్ వంటి వాటిలో ఆప్రికాట్లను తినవచ్చు. అలాగే.. ఎండిన ఆప్రికాట్లను ఏ విధంగానైనా తీసుకోవచ్చు.