Peddha Kapu-1 Review: 1980 సంవత్సరం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రి ప్రాంతానికి చెందిన పెదకాపు (విరాట్ రాజ్) ఆ గ్రామం లో ఉన్న కుల రాజకీయాలను నడిపే సత్య రంగయ్య( రావు రమేష్ ), భయ్యన్న(ఆడుకాలం నరేన్) అనే ఇద్దరు అధికార కేంద్రాల అణిచివేత కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక ఊరి లో జరిగిన కథ ఇది…ఇక 1982 లో ఎన్టీయార్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అక్కడా ఉన్న జనం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారన్న దానిపై మలిచిన సినిమా ‘పెదకాపు1’ రివ్యూలోకి వెళ్లి ఇది ఎలా ఉందో తెలుసుకుందాం
అసలు హీరో అయినా విరాట్ రాజ్ కి, సత్య రంగయ్య, భయ్యన్నలు ఊర్లో ఏం చేశారు. వీళ్ళకి అక్కమ్మ (అనసూయ) కి మధ్య ఉన్న సంభందం ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. అయితే ఇది కంప్లిట్ గా 1980 వ సంవత్సరం లో శ్రీకాంత్ అడ్డాల రీసెర్చ్ చేసి రాసుకున్న ఒక ఫిక్షన్ కథ గా తెలుస్తుంది….ఇక ఈ సినిమా స్టోరీ రాసుకోవడం లో శ్రీకాంత్ అడ్డాల ఒక మంచి కథని జనాలకి చెప్పాలి అని చూసారు. ఆయన ప్రయత్నం లో ఆయన సక్సెస్ అయ్యారా, లేదా అలాగే ఈ సినిమాలో చేసిన నటీనటులు ఎలా చేసారు అనే విషయాలను ఒకేసారి మనం తెలుసుకుందాం…
ఈ సినిమా హీరో అయిన విరాట్ రాజ్ కొత్త అబ్బాయి అయిన కూడా ఆయన తన పాత్రని చాలా బాగా పోషిచాడు. ఇక ఎక్కడ కూడా తనకి ఇది మొదటి సినిమా అనేలా చేయకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడుగా సినిమా చేసాడు. రావు రమేష్ కూడా తన నాచురల్ యాక్టింగ్ తో చాలా బాగా చేసాడు ఇక నరేన్ కూడా ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకుండా పాత్ర మేరకే నటించాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ సినిమాలో ఒక పాత్ర లో కనిపించరు ఆ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇక అనసూయ కి మళ్లీ రంగస్థలం తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ్ కూడా ఒకే అనిపించింది నాగబాబు కూడా పర్లేదు అన్నట్టు గా చేసారు..ఇక ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అంత గొప్పగా ఇవ్వకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఆయన బిజియం వల్లే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి…
ఒకసారి టెక్నీకల్ విషయాలను చూసుకుంటే సినిమాటోగ్రాఫర్ అయిన చోట కె నాయుడు మళ్లీ చాలా రోజుల తరువాత సినిమా చేసిన తన వర్క్ ని చాలా ప్లజెంట్ గా చేసారు. ప్రతి ఫ్రెమ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు.విజువల్ గా చూడ చక్కగా ఉంది ఈ సినిమా…ఇక ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈయన కూడా చాలా సీనియర్ ఎడిటర్ కావడం తో ఈయన సీనియారిటీ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది.ఈయన ప్రతి సీన్ ని ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంచి మిగితాది కట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక చాలా షార్ప్ ఎడిటింగ్ ని కూడా వాడారు దీంట్లో ఆయన తరపు నుండి ఎలాంటి చిన్న మిస్టేక్స్ లేకుండా చాలా కేర్ ఫుల్ గా చూసుకొని చేసాడు…
ఇక ఈ సినిమా గురించి చూసుకుంటే కుల రాజకీయాల మీద సినిమాలు రావడం అనేది తెలుగు లో ఈ మధ్య కాలం లో రంగస్థలం సినిమా నుంచి స్టార్ట్ అయింది.ఆ సినిమాతో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ అయితే చేసాడో అందరు అలాంటి మ్యాజిక్ చేయాలని చూస్తున్నప్పటికీ అది అందరికి వర్క్ అవుట్ కావడం లేదు.ఇక ఈ సినిమా వరకు శ్రీకాంత్ అడ్డాల తీసుకున్న బ్యాక్ డ్రాప్ బాగానే ఉంది, కానీ కథ మీద ఇంకా కొంచం దృష్టి పెట్టి ఉంటె బాగుండేది.అలాగే మేకింగ్ పరంగా కూడా చాలా మిస్టేక్స్ కూడా శ్రీకాంత్ చేసాడు. అలాగే ఎప్పుడైతే నారప్ప తీసాడో ఆయనకి అప్పటి నుంచే ఇలాంటి సినిమా ఒకటి తీయాలి అని అనిపించి ఉండచ్చు అందుకే నారప్ప టైపు అఫ్ కొన్ని షాట్స్ ని కూడా ఇందులో వాడటం జరిగింది.
శ్రీకాంత్ చేసిన ప్రయత్నం లో తప్పు లేదు కానీ ఆయన సినిమాని ప్రెసెంట్ చేసిన విధానం ఈ సినిమాకి సెట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాలో హైలెట్ అయ్యే అంశాలు ఎమన్నా ఉన్నాయి అంటే అవి ఒకటి చోటా కె నాయుడు విజ్వల్స్ అండ్ మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగితాదంతా ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. డైరెక్షన్ కూడా కొన్ని సీన్లలో అంత బాగా సెట్ అవ్వలేదు…ఇక మొత్తానికి శ్రీకాంత్ చేసిన ఒక మంచి ప్రయత్నం లో కొన్ని లోపాలు లేకుండా ఉంటె ఇంకా బాగుండేది…
ఇక ఈ సినిమా కి మనం ఇచ్చే రేటింగ్ 2 /5 అది కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఇవ్వచ్చు…