Kidney Stones: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో కిడ్నీలో రాళ్ల సమస్య కూడా ఒకటి. మన శరీరానికి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటనే సంగతి తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ఎంతగానో సహాయపడతాయనే సంగతి తెలిసిందే.
ప్రస్తుత కాలంలొ కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. శరీరంలో కాల్షియం ఎక్కువగా ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కిడ్నీ సంబంధించిన సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
Also Read: చక్కెర ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా.. వాస్తవాలు ఇవే?
పొత్తికడుపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్ల సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంట ఉన్నా, రక్తం వచ్చినా కిడ్నీ సమస్య అయ్యే ఛాన్స్ ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టాలంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయలను తక్కువగా తినాలి. తులసి తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది.
కషాయాలను తాగడం, ఖాళీ సమయంలో గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది. ఉల్లిపాయను పచ్చిగా తినడం లేదా ఉల్లిపాయ రసం తాగడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్యను దూరం చేసుకోవచ్చు.
Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?