https://oktelugu.com/

ప్లేట్ లెట్ల సంఖ్య పెరగాలా.. తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..?

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వర్షాకాలంలో దోమల వల్ల ఎక్కువమంది డెంగీ బారిన పడే అవకాశం ఉంటుంది. డెంగీ బారిన పడితే ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లేట్ లెట్ల సంఖ్య మరింత ఎక్కువగా తగ్గితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. శరీరంలో ప్లేట్ లెట్లు తగ్గితే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావడంతో పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 5, 2021 / 11:46 AM IST
    Follow us on

    ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వర్షాకాలంలో దోమల వల్ల ఎక్కువమంది డెంగీ బారిన పడే అవకాశం ఉంటుంది. డెంగీ బారిన పడితే ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లేట్ లెట్ల సంఖ్య మరింత ఎక్కువగా తగ్గితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. శరీరంలో ప్లేట్ లెట్లు తగ్గితే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావడంతో పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

    పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను సులభంగా పెంచుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండు ద్రాక్ష ప్లేట్ లెట్లను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. బొప్పాయి పండ్లను తినడం ద్వారా ప్లేట్ లెట్లు పూర్తిగా తగ్గిన వాళ్లు కోలుకునే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మోతాదులో బొప్పాయి రసం తీసుకున్నా ప్లేట్ లెట్ల వేగం పెరుగుతుందని సమాచారం.

    ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా కూడా ప్లేట్ లెట్ల సంఖ్యను సులభంగా పెంచుకోవచ్చు. వీటి ద్వారా రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆఫ్రికాట్, కివి, ఎండు కర్జూరం తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడంతో పాటు వ్యాధులు నయమయ్యే అవకాశాలు ఉంటాయి. బీట్ రూట్, క్యారెట్ ప్లేట్ లెట్లు పెరిగేలా చేయడంలో తోడ్పడతాయి.

    వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకుంటే కూడా ప్లేట్ లెట్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను తరచూ తీసుకునే వాళ్లు డెంగీ బారిన పడినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. ఇలా చేయడం ద్వారా వైద్యానికి అయ్యే డబ్బు ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.