https://oktelugu.com/

Salt: ఉప్పు తగ్గించుకోకపోతే ఆరోగ్యానికి ముప్పే

Salt: అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అందట ఉప్పు. ఇటీవల కాలంలో ఉప్పు వినియోగం పెరుగుతోంది. ఉప్పు మన శరీరానికి అవసరమే ఉండదని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పుతో చాలా అనర్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వస్తున్న గుండెపోట్లు ఉప్పు వల్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2023 / 09:02 AM IST
    Follow us on

    Salt: అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అందట ఉప్పు. ఇటీవల కాలంలో ఉప్పు వినియోగం పెరుగుతోంది. ఉప్పు మన శరీరానికి అవసరమే ఉండదని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పుతో చాలా అనర్థాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వస్తున్న గుండెపోట్లు ఉప్పు వల్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉప్పు వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చింది. కానీ ఆ పిలుపుకు తొమ్మిది దేశాలు మాత్రమే స్పందిస్తున్నాయి. మిగతా దేశాలు పట్టించుకోవడం లేదు. దీంతో ఉప్పు ముప్పు ప్రజలను పీడిస్తూనే ఉంది.

    పాటించే దేశాలేవి?

    బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేసియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే దేశాలు మాత్రమే ఉప్పు వాడకాన్ని తగ్గించే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఉప్పు తగ్గించకపోతే ఎదురయ్యే ప్రమాదాల గురించి చెప్పకనే చెబుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఉప్పు సాధ్యమనంత వరకు తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఉప్పు వాడకంతో కలిగే ముప్పును ముందే పసిగట్టి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాయి.

    రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి?

    ప్రతి రోజు మనిషి ఎంత ఉప్పు తీసుకోవాలంటే 4 గ్రాములు సరిపోతుంది. కానీ మనం 10.8 గ్రాములు తీసుకుంటున్నాం. ఫలితంగా అనేక రోగాలకు నిలయంగా మారుతున్నాం. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి జబ్బుల బారిన పడుతున్నాం. మన దేశంలో 9.8 గ్రాముల ఉప్పు రోజుకు సటున తీసుకుంటున్నాం. రోజువారీ ఆహారంలో ఇంకా మనం తినే ఇతర ప్రాసెస్ పదార్థాల నుంచి ఉప్పు అధికంగా వస్తోంది. దీన్ని ఎవరు గుర్తించడం లేదు. ఉప్పు మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు.

    ఎక్కువగా తీసుకుంటే?

    ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కడుపులో క్యాన్సర్, కిడ్నీల్లో రాళ్లు, ఎముకల పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. కొన్ని సమయాల్లో అకాల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. సోడియం వినియోగాన్ని తగ్గించకపోతే తగిన ప్రతిఫలం అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశం ఉప్పు వినియోగంలో ఎల్లో జాబితాలోనే ఉందని చెబుతోంది. అంటే ఎంత ప్రమాదంలో ఉన్నామో తెలుసుకోవడం లేదు.

    ఉప్పుకు బదులు..

    ఉప్పుకు బదులు ఏం తీసుకోవాలి అనే సందేహాలు అందరికి రావడం కామనే. ఉప్పు వేసుకోకుండా ఉండాలంటే నిమ్మరసం చేర్చుకుంటే ఉప్పు లేని లోటు తెలియదు. నిమ్మరసం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కొన్నింట్లో తేనె కూడా వేసుకుంటారు. ఉప్పును మాత్రం దూరం చేసుకోకపోతే దానితో మనకు డేంజరే అని తెలుసుకోవాలి. ఊరగాయలు, పొడులు, సాల్టెడ్ వేరుశనగలు, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన పదార్థాలు తినడం మానేయడం మంచిది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. వాటికే ఆకర్షితులవుతున్నారు.

     

    Tags