Vomiting Problem: చాలామంది అనుకోకుండా.. లేదా కొన్ని పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కొందరికి జర్నీ అంటే అసలు పడదు. ముఖ్యంగా కారులో వెళ్లేవారు వాంతులు చేసుకుంటారు. ఇంకొందరు బస్సులో ప్రయాణం చేస్తే తల తిరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. కానీ తప్పనిసరిగా ఈ వాహనాల్లో వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి? అన్న సందేహం చాలా మందిలో వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దగ్గర ఎటువంటి ప్రత్యామ్నాయ లేకపోతే ఈ చిన్న పని ద్వారా వచ్చే వాంతులను ఆపుకోవచ్చు. అదేంటంటే?
సరైన ఆహారం తీసుకోకపోవడం.. ఖాళీ కడుపుతో ప్రయాణం చేయడం.. అంతకుముందు రాత్రి ఆయిల్ తో కూడిన ఆహారాన్ని తినడం.. నిద్ర సరిగా లేకపోవడం వల్ల.. ఆ మరుసటి ఉదయం ప్రయాణం చేయాల్సివస్తే వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి కారులో ఉండే ఏసీ పడక వాంతులు వస్తాయి. ఇలాంటి వారికి ప్రయాణంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఆందోళన చెల్లకుండా కుడిచేతిలోని అరచేతి కింద కాసేపు మర్దన చేయాలి. అరచేతి నుంచి మూడు వేల కిందికి పిడికిలిలా పట్టుకొని మర్దన చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉండే P6 పాయింట్ వద్ద ఉన్న రెండు నరాలతో మెదడు లోని నరాలకు లింకు అయి ఉంటాయి. వీటిని మర్దన చేయడం వల్ల మెదడులో ఒత్తిడి తగ్గిపోతుంది. బొటనవేలితో రెండు నిమిషాల పాటు ఒత్తి పట్టినా సరే.. వాంతులు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మార్కెట్లో దొరికే సి బాండును వాడుకోవచ్చు. ఇవి పిల్లలకు, పెద్దలకు సేఫ్ గా ఉంటుంది.
అయితే ఇది ప్రాథమికంగా వాంతులు తగ్గడానికి మాత్రమే. కొందరిలో అనారోగ్య సమస్యలు ఉంటే ఇలా చేసినా కూడా వాంతులు తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే వాంతులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు లేదా కారులో ప్రయాణం చేసేటప్పుడు కిటికీ పక్కన కూర్చోవడం మంచిది. వాహనం లోపలే విషయాలు కాకుండా దూరంగా ఉండే దృశ్యాలను చూడడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎయిర్ కండిషన్ తగ్గించుకునేందుకు కిటికీలను తెరుచుకునే ప్రయత్నం చేయాలి. అదే పనిగా ఫోన్ చూడడం లేదా స్క్రోలింగ్ చేయడం వల్ల తలతిప్పినట్లయితే వెంటనే వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం చేసే ముందు అల్లం ముక్క లేదా అల్లం క్యాండి వెంట తీసుకెళ్లాలి.
ఒకవేళ వాంతులు ప్రారంభమై అదే పనిగా వస్తే సమీప వైద్యుల వద్దకు తీసుకెళ్లడం మంచిది. అది సాధ్యం కాకపోతే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో వాహనాన్ని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది.
View this post on Instagram