Adulterated Food: కాలం మారుతున్న కొద్దీ మార్కెట్లోకి రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే పదార్థాలని ఎక్కువగా తీసుకున్నారు. కానీ ఈ పదార్థాల్లో ఎక్కువగా కల్తీ వస్తువులు వాడుతున్నట్లు ఎప్పటికప్పుడు అధికారులు గుర్తిస్తున్నారు. 2022 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నమోదైన కల్తీ ఆహార కేసుల్లో అత్యధికంగా హైదరాబాదులోనే రికార్డు అయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే చాలా ఆహార పదార్థాలు కచ్చితంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో బయట ఆహారం తినేవారు ఈ విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే?
వర్షాకాలం పూర్తి అయిన తర్వాత చలికాలంలో సాధారణ వాతావరణం ఉంటుంది. కానీ వర్షాలు ఇంకా చూస్తుండడంతో వాతావరణంలో ప్రస్తుతం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకుకూరల్లో, కూరగాయల్లో ఫంగస్ వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పటికే ఆయిల్, జింజర్ పేస్ట్ వంటివి మార్కెట్లోకి కల్తీ అయినట్లు గుర్తించారు. ఇవి పైన కవర్ బ్రాండ్ పేరుతో ఉన్నా.. లోపల మాత్రం నాసిరకమైన పదార్థాలను పెట్టి సరఫరా చేస్తున్నారు. వీటిని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, రోడ్డుపై విక్రయించే ఆహార పదార్థాలకు విక్రయిస్తున్నారు. దీంతో చాలామంది వీటిని తిని అనారోగ్యానికి గురైన వారున్నారు. అందువల్ల ప్రస్తుతం ఆహార పదార్థాలు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాకుండా కొన్ని బ్రాండ్ పేరు చెప్పి కల్తీ వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని వినియోగించుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేసిన ప్రతి ప్యాకెట్ పై food safety and standards Authority of India (FSSAI) లైసెన్స్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్యాకేజీ తయారు అయిన తేదీ నుంచి గడువు తేదీని సరిచూసుకోవాలి. కొనుగోలు చేసినప్పుడు ఆ ప్యాకెట్ తెరిచి ఉందా? లేదా అనేది చూసుకోవాలి. అయితే ఒక్కోసారి తొందరలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి ఇంట్లోకి తీసుకువస్తాం. ఇలాంటి సమయంలో కొన్నిటిని ఈ చిట్కాల ద్వారా కల్తీ ఆహార పదార్థాలను గుర్తించవచ్చు. కల్తీ పసుపు అయితే ఒక గ్లాసులో కొద్దిగా పసుపు వేసే దానిలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరి కాండం లేదా నిమ్మరసం కలపాలి. అది వెంటనే గులాబీ రంగులోకి మారితే అందులో రసాయన రంగు కల్తీ ఉన్నట్లు గుర్తించాలి. నెయ్యిలో కల్తీ ఉన్నట్లు అనిపిస్తే దానిని వేడి చేసి అందులో కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణం కలపాలి. ఇది నీలం రంగులోకి మారితే ఇందులో పిండి పదార్థాలు కలిపినట్లు. అలాగే పండ్లు కూడా కల్తివో? కావో? గుర్తించవచ్చు. ఉదాహరణకు యాపిల్ తొక్కపై నెమ్మదిగా ఒక కత్తితో తీస్తే తెల్లటి మైనపు పూత వస్తే అది కల్తీ అని అర్థం చేసుకోవాలి.
ఇలా ఎన్నో రకాల కల్తీ వస్తువులు మార్కెట్లో ఉండడంతో ముందు జాగ్రత్తగా బయట దొరికే ఆహార పదార్థాలను కొనకుండా ఉండాలి. ఇంట్లోనే వండిన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా ఏదైనా ఆహారం తయారు చేసుకునే సమయంలో వేడి చేసుకోవాలి. ఇదే సమయంలో స్వచ్ఛమైన నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి.