https://oktelugu.com/

Corona: అసలు కరోనా వచ్చిందో లేదో ఎలా గుర్తించాలంటే? జాగ్రత్తలివీ!

Corona: మాయదారి కరోనా మళ్లీ వచ్చేసింది. దేశంలో నిన్న ఒక్కరోజే 1.60 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. క్రమంగా థర్డ్ వేవ్ పై దేశం పోతోంది. ఈక్రమంలోనే దగ్గినా.. తుమ్మినా కూడా కరోనా వచ్చేసిందన్న భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. మరి ఇలా సమయంలో మనకు కరోనా వచ్చిందా? లేదా? అన్నది ఎలా తెలుసుకోవడం.. టెస్టులు చేయించుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్పెషల్ స్టోరీ.. ఒమిక్రాన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2022 / 08:50 AM IST
    Follow us on

    Corona: మాయదారి కరోనా మళ్లీ వచ్చేసింది. దేశంలో నిన్న ఒక్కరోజే 1.60 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. క్రమంగా థర్డ్ వేవ్ పై దేశం పోతోంది. ఈక్రమంలోనే దగ్గినా.. తుమ్మినా కూడా కరోనా వచ్చేసిందన్న భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. మరి ఇలా సమయంలో మనకు కరోనా వచ్చిందా? లేదా? అన్నది ఎలా తెలుసుకోవడం.. టెస్టులు చేయించుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్పెషల్ స్టోరీ..

    ఒమిక్రాన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ఆ తరువాత ఆసియా దేశాల్లోనూ జెట్ స్పీడుతో దూసుకుపోతుంది. భారత్ లాంటి దేశాల్లో రోజుకు కరోనా కేసులు లక్షన్నర నమోదు అవుతుండగా ఇందులో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే ఉంటున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. కరోనా అంతానికి ఇప్పటి వరకు పూర్తి మెడిసన్ రాలేదు. అయితే అది శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేందుకు మాత్రం వ్యాక్సిన్లు అందిస్తున్నారు. ఇది తాత్కలిక ఉపశమనే అయినా జాగ్రత్తలు పాటించడమే అసలైన మందు అని వైద్యులు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం ప్రధాన ధ్యేయమని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ నుంచి బయటపడవచ్చని వైద్యనిపుణలు అంటున్నారు.

    కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు కొత్త లక్షణాలు ఏమీ లేవు.గతంలో మాదిరిగా కరోనా లక్షణాలు కనిపిస్తే అనుమానించవచ్చని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అయితే పలు సందర్భంగా బయటికి వెళ్లినప్పుడు, ఇతరులను కలిసినప్పుడు ఆ ప్రదేశంలో కరోనా నిర్దారణ అయితే ఆ సమయంలో మీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఒక్కోసారి లక్షణాలు బయట కనిపించకపోవచ్చు.. కానీ టెస్టుల ద్వారా బయటపడే అవకాశం ఉంది. దీంతో ప్రారంభంలోనే దానిని నివారించే అవకాశం ఉంటుంది. అందువల్ల కరోనా టెస్టులు చేయించుకోవడానికి ఏమాత్రం వెనుకాడొద్దు.

    కరోనా నిర్దారణ కాగానే ఒంటరిగా ఉండడం మేలు.లేదంటే ఇతరులకు సోకి పెద్ద ప్రమాదం ఏర్పడవచ్చు. ఒకవేళ యాక్టివ్ గా ఉన్న వారిలో కరోనా నిర్దారణ కాగానే ఓ గదిలోకి వెళ్లండి. కుటుంబ సభ్యులకు సోకకుండా జాగ్రత్తపడండి. ఒక్కోసారి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో వైరస్ తొందరగా తొలిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒంటరిగా ఉండి మీ పనులు మీరే చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోండి.

    మీకు కరోనా సోకిందని తెలియగానే మీ చుట్టు పక్కల ఉన్నవారికి కచ్చితంగా తెలియజేయండి. చాలా మంది ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి సాహసించరు. దీంతో ఇతరులకు తెలియకపోవడంతో అనుకోకుండా మీ ఇంటికి రావచ్చు. అందువల్ల ముందుగా ఈ విషయం చెబితే వారు జాగ్రత్తపడుతారు. ఇక ఇప్పటి వరకు మీతో కాంటాక్ట్ అయిన వారికి కూడా తెలియజేయండి. ఎందుకంటే వారికి కూడా లక్షణాలు ఉంటేపరీక్షలు చేయించుకుని నిర్దారణ చేసుకుంటారు.

    కొందరికి స్వల్ప లక్షణాలు కనిపించగానే టెస్ట్ చేస్తేకరోనా నిర్దారణ అవుతుంది. కానీ ఆ తరువాత ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. ఈ లక్షణాల్లో మార్పులు రావచ్చు. శరీరంలో ఆక్సిజన్ 95 శాతం కంటే ఎక్కువ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలి.

    కరోనా నిర్దారణ అయిన తరువాత విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కరోనాకు సరైన మందులు లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న మెడిసిన్ తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి. కరోనా సోకగానే హైడ్రోక్లోరాక్సిన్, ఐవర్ మెక్టిన్, నైటాజోక్సనైడ్ వంటిమెడిసిన్ ఇస్తున్నారు. అయితే ఇవి తీసుకున్నా ప్రాణాలు దక్కని సంఘటనలు ఉన్నాయి. అందువల్ల రోగికి తగిన విశ్రాంతితో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

    సరైన జాగ్రత్తలు తీసుకొని కరోనా నుంచి బయటపడ్డాక ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వైద్యులను అడిగి టీకా తీసుకోవాలి. లేదంటే మరోసారి సోకే ప్రమాదం ఉంది. అయితే వ్యాక్సిన్లు కేవలం రోగ నిరోధక శక్తిని పెంచుతాయని, ఇవి వేసుకున్నవారికి కరోనా నిర్దారణ అయినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారని వైద్యులు అంటున్నారు.