
దేశంలో దీర్ఘకాలిక సమస్యలైన బీపీ, షుగర్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తినే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల చాలామంది బీపీ, షుగర్ తో బాధ పడుతున్నారు. గతంలో పట్టణాల్లో మాత్రమే బీపీ, షుగర్ బాధితులు ఉండగా ప్రస్తుతం పల్లెల్లో కూడా చాపకింద నీరులా బీపీ, షుగర్ కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరు షుగర్ బారిన పడుతున్నారు.
దేశంలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు బీపీతో బాధ పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో పెట్టుకోవచ్చు. వ్యాయామం లేకపోవడం వల్లే ఎక్కువమంది ఈ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ ఉన్నవాళ్లు పప్పుదినుసులు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పప్పు దినుసుల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ చక్కర స్థాయిలు పెరగకుండా చూసుకుంటాయి.
వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొబ్బరినీళ్లు తాగడం ద్వారా రక్తపోటుకు సులభంగా చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో శరీరానికి మేలు జరుగుతుంది. ఇంటివద్ద తయారు చేసుకున్న పచ్చళ్లు తినడం ద్వారా పచ్చళ్లలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చిరు, పప్పు ధాన్యాలతో తయారైన పాపడ్స్ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపోయే నిద్రతో పాటు విశ్రాంతి కూడా ఉండాలి. కార్డియో, యోగ వల్ల రోజూ కొంత సమయం నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.