Kill OTT: వైలెన్స్ కి మీనింగ్ చెప్పిన చిత్రం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్!

దర్శకుడు నిఖిల్ భట్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ కిల్ జులై 5 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. కిల్ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. నాన్ స్టాప్ యాక్షన్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది.

Written By: S Reddy, Updated On : July 3, 2024 4:34 pm

Kill OTT

Follow us on

Kill OTT: యాక్షన్ మూవీ లవర్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ చిత్రం. మరో రెండు రోజుల్లో ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఆ చిత్ర వివరాలు ఏమిటో చూద్దాం.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో యాక్షన్ చిత్రాలకు కొదవ ఉండదు. తాజాగా మరొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ చిత్రానికి మించిన వైలెన్స్ ఆ చిత్రంలో చూడొచ్చు. ఆ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రం టైటిల్ ఏమిటంటే… కిల్.

దర్శకుడు నిఖిల్ భట్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ కిల్ జులై 5 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. కిల్ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. నాన్ స్టాప్ యాక్షన్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. వైలెన్క్ పీక్స్ అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వైలెన్స్ కి అర్థం చెప్పేలా కిల్ మూవీ ఉంది. ఇది వన్ మ్యాన్ ఆర్మీ షో. ఒకే ఒక్కడుట్రైన్ లో దొంగల ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు.

కిల్ మూవీ కథ విషయానికి వస్తే… అమ్రిత్(లక్ష్య) ప్రేయసి తులిక(తాన్యా మానిక్తల)ని కలిసిసేందుకు ఢిల్లీ ట్రైన్ ఎక్కుతాడు. తులిక కు పెద్దలు ఇష్టం లేకుండా బలవంతపు వివాహం చేసే ప్రయత్నాలలో ఉంటారు. ఆ పెళ్లిని ఆపి ప్రేయసిని దక్కించుకోవాలి అనేది అమ్రిత్ ఆలోచన. అందుకే ట్రైన్ లో ఢిల్లీకి వెళతాడు. అదే ట్రైన్ లో ఫణి(రాఘవ్ జుయల్)తన గ్యాంగ్ తో ఎక్కుతాడు.

ట్రైన్ ఫస్ట్ క్లాస్ బోగీల్లోని ప్యాసింజర్స్ ని దోచుకోవాలి అనేది ఫణి ఆలోచన. ఇతర బోగీలతో ఫస్ట్ క్లాస్ భోగీలకు కనెక్షన్ లేకుండా షట్టర్లు క్లోజ్ చేస్తారు. సిగ్నల్స్ జామ్ చేస్తారు. ఫణి దోచుకోవాలనుకున్న బోగీల్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉంటాడు. ఫణి గ్యాంగ్ అమ్రిత్ లవర్ తులిక ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు అమ్రిత్ తిరగబడతాడు. గ్యాంగ్ సభ్యులను అమ్రిత్ ఎలా ఎదిరించాడు? తన లేడీ లవ్ ని తిరిగి ఎలా దక్కించుకున్నాడు? అనేది మిగతా కథ.