Lunch Dinner Time: రోజు మీరు తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫుడ్ తో పాటు మంచి సమయం కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. రాత్రి చాలా త్వరగా తినేయాలి. లేట్ నైట్ లో ఫుడ్ తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇక లంచ్, డిన్నర్ మధ్య సరైన టైం గ్యాప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ప్రశ్న ఏంటంటే? లంచ్, డిన్నర్ మధ్య ఎన్ని గంటలు గ్యాప్ ఉండాలి? ఎందుకు? ఈ విషయంలో నిపుణులు ఏం అంటున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ పోషకాహార నిపుణులు శిఖా అగర్వాల్ మాట్లాడుతూ లంచ్, డిన్నర్ మధ్య 4 నుంచి 6 గంటల గ్యాప్ ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి జీర్ణవ్యవస్థకు తగినంత సమయాన్ని ఇస్తుంది. జీవక్రియను చురుకుగా ఉంచుతుంది. గ్యాప్ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉంటే, అది జీర్ణక్రియ, శరీర శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుంది.
గ్యాప్ సరిగ్గా లేకపోతే వచ్చే నష్టాలు
1. జీర్ణవ్యవస్థపై ప్రభావం:
లంచ్, డిన్నర్ మధ్య చాలా ఎక్కువ గ్యాప్ ఉంటే, అప్పుడు కడుపులో ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉండవచ్చు. అదే సమయంలో, విరామం తక్కువగా ఉంటే జీర్ణవ్యవస్థకు తగినంత సమయం ఉండదు. ఇది కడుపులో భారం పెరిగినట్టు అనిపిస్తుంది.
2. బరువు పెరిగే ప్రమాదం:
తక్కువ గ్యాప్ కారణంగా, శరీరానికి ఎక్కువ ఆకలి వేస్తుంది. సమయం మించితే చాలు ప్రతి సారి ఆకలి అవుతుంది. దీని వల్ల మీరు ఎక్కువ తింటారు. అంటే ప్రజలు అనారోగ్యకరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తీసుకుంటారు. ఈ అలవాటు బరువు పెరగడానికి అతి పెద్ద కారణం అవుతుంది.
3. బ్లడ్ షుగర్ అసమతుల్యత:
లంచ్, డిన్నర్ మధ్య సరైన సమయాన్ని పాటించకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ప్రమాదకరం.
4. నిద్రపై ప్రభావం:
రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఒత్తిడి, అలసటను కలిగిస్తుంది.
సరైన గ్యాప్ నిర్వహించడానికి చిట్కాలు
: భోజనం తర్వాత 4-6 గంటల తర్వాత రాత్రి భోజనం చేయండి.
* గ్యాప్ ఎక్కువైతే, మధ్యమధ్యలో పండ్లు, గింజలు లేదా పెరుగు వంటి తేలికపాటి, పోషకమైన చిరుతిండిని తీసుకోండి.
* అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్లతో మధ్మాహ్నం భోజానాన్ని తీసుకోండి. ఇక రాత్రి భోజనాన్ని తేలికగా, సమతుల్యంగా ఉంచండి.
* నిద్రించడానికి కనీసం 2-3 గంటల ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..