Best Walking Tips: ప్రతిరోజు ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని అంటుంటారు. ఈ వ్యాయామంలో భాగంగా నడక అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే వాకింగ్ చేయడం అంటే ఏదో సాధారణంగా కొన్ని నిమిషాల పాటు చేసి ఆ తర్వాత ఆపిస్తారు. ఇలా వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణ ఏమాత్రం ఉండదు అని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కచ్చితంగా క్రమ పద్ధతిలో నడవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. క్రమ పద్ధతిలో అంటే ప్రతిరోజు కనీసం 4,000 అడుగులు వేయాలని అంటున్నారు. అయితే 10,000 అడుగులు వేయడం మరీ మంచిదని అంటున్నారు. అసలు 4 అడుగులు వేసే వారితో పోలిస్తే పదివేల అడుగులు వేసే వారిలో ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది?
ప్రతిరోజు చేసే నడక వల్ల ఒక వ్యక్తి ఎంతకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతాడు? ఎంత ఆయుష్షు ఉంటుంది? అనేది నిర్వహించవచ్చు అని అంటున్నారు. ప్రతిరోజు 4,000 అడుగులు వేయడంతో ఇది సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. కానీ ఇలా 4వేల అడుగులు వేసే వారిలో రక్తప్రసరణ తక్కువగా ఉండి.. అలసట ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏ పని సక్రమంగా చేయలేక పోతారు. అయితే ప్రతిరోజు 6,000 అడుగులు వేసేవారిలో వర్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా వీరిలో 4,000 అడుగులు వేసే వారి కంటే ముందస్తు మరణ శాతం 15% తక్కువగా ఉంటుంది. అయితే వీరు సాధారణ నడక కాకుండా మెట్లు ఎక్కడ వంటివి చేయడం వల్ల అనుకున్న అడుగులకు రీచ్ కావచ్చు. అలాగే 7,000 అడుగులు వేసేవారిలో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాకుండా వీరిలో ముందస్తు మరణశాతం 35% తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పదివేల అడుగులు వేసేవారిలో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. వీరిలో గుండె సమస్యలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 12000 అడుగులు వేసే వారిలో మరింత ఉత్సాహం ఉంటుంది. ఏ పని అయినా వెంటనే చేయగలుగుతారు.
అందువల్ల ప్రతిరోజు కనీసం 8,000 అడుగుల నుంచి పదివేల అడుగుల వరకు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు ముందస్తు మరణాల రిస్కు తక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే ప్రతి చిన్న పనిలో వాహనాలు ఉపయోగించకుండా నడవడం వల్ల టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఒకే చోట ఎక్కువగా పనిచేయడం వల్ల.. తక్కువగా నడవడం వల్ల.. ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని చేసే అవకాశాలు ఉన్నాయి.