Rajamouli Varanasi concept: ఒక సినిమాకు కనీవినీ ఎరుగని రేంజ్ హైప్ తీసుకొని రావడం ఎలా? అనే అంశంలో రాజమౌళి(SS Rajamouli) ని మించిన వాడు భారత దేశంలో ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. #RRR చిత్రం విడుదల సమయం లో, ఆయన కేవలం ప్రొమోషన్స్ కోసం ఆరు నెలల సమయం తీసుకున్నాడు. ఆ రేంజ్ లో ప్లాన్ చేసాడు కాబట్టే, ఆ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. వెయ్యి కోట్ల గ్రాస్ ఊరికినే రాదు, అందుకు తగ్గ కృషి కూడా ఉండాలి. ఇక జపాన్ లో #RRR విడుదల సమయం లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జపాన్ లో ఉన్న ప్రతీ సిటిజెన్ ఈ సినిమా గురించి మాట్లాడుకునే రేంజ్ లో పబ్లిసిటీ చేసాడు. ఫలితంగా ఆ చిత్రం అక్కడి థియేటర్స్ లో సంవత్సరం పాటు రన్ అయ్యింది.
కేవలం జపాన్ దేశం నుండి దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలా ఉంటుంది మరీ రాజమౌళి సినిమా ప్రొమోషన్స్ అంటే. ఇక ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న ‘వారణాసి’ మూవీ ప్రొమోషన్స్ ని విడుదలకు రెండేళ్ల ముందే ప్రారంభించినట్టుగా అనిపిస్తోంది. అసలే పాన్ వరల్డ్ సినిమా, ప్రతీ ఒక్కరికి ఈ చిత్రం చేరాలంటే ఆ మాత్రం సౌండ్ చేయకపోతే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన #Globetrotter ఈవెంట్ ని చూసి కొంతమంది టైటిల్ ని రివీల్ చేయడం కోసం ఇంత పెద్ద ఈవెంట్ అవసరమా? అంటూ కామెడీ చేశారు. కానీ ఈ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వారణాసి మూవీ గురించే చర్చలు నడుస్తున్నాయి.
ముందుగా విలన్ క్యారక్టర్ కుంభ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పై సోషల్ మీడియా వచ్చినన్ని మీమ్స్ ఏ సినిమాకు కూడా రాలేదు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదలైంది. చివర్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని గ్లింప్స్ వీడియో తో విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియో చూపించిన ప్రదేశాలు గురించి సోషల్ మీడియా నెటిజెన్స్ వెతకడం, వాటి ప్రత్యేకతని వివరిస్తూ ఎన్నో వందల వీడియోస్ చేశారు. మొత్తానికి సినిమాకు కావాల్సిన హైప్ ని రెండేళ్ల ముందే తీసుకొచ్చేసాడు. ఇక రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే ఈవెంట్స్, విడుదల చేయబోయే కంటెంట్ ద్వారా ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు ఏర్పడుతాయా మీ ఊహలకే వదిలేస్తున్నాం.