Daily Walking Tips: ఆరోగ్యంగా ఉండేందుకు నేటి కాలంలో చాలామంది ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నారు. అయితే వాకింగ్ అంటే ఏదో సరదాగా బయటకు వెళ్లినట్లు వెళ్లి.. వెంటనే తిరిగి వస్తున్నారు. ఉద్యోగ కారణాలు కావచ్చు.. ఇతర పనులు ఉండడం కావచ్చు.. కొందరు ఎప్పటికీ బిజీ వాతావరణం లో ఉంటారు. అయితే ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు మినిమం అడుగులు వేయకపోతే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన నివేదిక ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు లేదా ప్రతి వారం కొన్ని నిమిషాల పాటు వాకింగ్ చేయకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. మరి ఒక వ్యక్తి ప్రతి రోజు ఎంత సేపు నడవాలి? అలా చేస్తే ఎంతవరకు ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంది?
వాకింగ్ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. కొందరు వాకింగ్ ఒంటరిగా చేస్తుంటారు. కానీ ఇలా ఒంటరిగా చేసే బదులు స్నేహితులతో కలిసి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఒక్కోసారి స్నేహితులు ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో నచ్చిన మ్యూజిక్ వింటూ వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. అంతేకాకుండా మంచి ఆలోచనలు వస్తాయి. ఇక వాకింగ్ ఒక క్రమ పద్ధతిలో చేయాలి. 30 నిమిషాలు వాకింగ్ చేయాలని నిర్ణయించుకుంటే.. 15 నిమిషాల పాటు స్పీడ్ గా నడవడం.. మరో 15 నిమిషాల పాటు స్లోగా వెళ్లడం వంటివి చేసుకోవాలి.
అయితే నేటి కాలంలో చాలామంది యువత ఎక్కువగా నడవడం లేదు. వాహనాలు అందుబాటులో ఉండడంవల్ల ప్రతి విషయానికి దానిపైనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో మినిమం వాకింగ్ చేయడం లేదు. ఈ క్రమంలో World Health Organisation (WHO) కొన్ని సూచనలు చేసింది. 25 నుంచి 40 ఏళ్ల లోపు వారు ప్రతి వ్యక్తి వారానికి 150 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని తెలిపింది. కనీసం 72 నిమిషాల పాటు స్పీడ్ గా నడవడం చేయాలి. అంటే ప్రతిరోజు కనీసం 22 నిమిషాల పాటు అయినా నడుస్తూ ఉండాలి. ఇది కేవలం వాకింగ్ రూపంలో కాకుండా ఏదైనా అవసరాల కోసం అయినా నడుస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల 22% గుండె జబ్బులు తగ్గిపోయే అవకాశం ఉంది. క్యాన్సర్ కారకాలు ఆరు శాతం వరకు తగ్గించుకోవచ్చు. 22 శాతం వరకు ఒత్తిడి తగ్గుతుంది.
అందువల్ల ప్రతిరోజు 22 నిమిషాలు లేదా 7000 అడుగులు కచ్చితంగా వేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వాకింగ్ అనేది కేవలం అనుకోకుండా జీవితంలో ఒక అవసరం గా గుర్తించి ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయాలి. అడల్ట్ ఎక్కువగా వాకింగ్ చేస్తేనే వారికి భవిష్యత్తులో ఆరోగ్యకరమైన వాతావరణము ఉంటుంది. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.